ఇంధన డిమాండ్ తగ్గే అవకాశం..!

by  |
ఇంధన డిమాండ్ తగ్గే అవకాశం..!
X

దిశ, వెబ్‌డెస్క్: ప్రస్తుత ఏడాది మొత్తానికి భారత్‌లో ఇంధన (fuel)డిమాండ్ 11.5 శాతం క్షీణిస్తుందని ప్రముఖ రేటింగ్ ఏజెన్సీ ఫిచ్ సొల్యూషన్స్ (fitch solutions)అంచానా వేసింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో వాస్తవ జీడీపీ(GDP) 8.6 శాతం ప్రతికూలత నమోదు కావడమే ఇంధన డిమాండ్ క్షీణతకు కారణమని ఆర్థిక వేత్తలు భావిస్తున్నారు. ఇది వరకు ఫిచ్ సొల్యూషన్స్ ఇంధన డిమాండ్ వృద్ధిని 9.4 శాతం ప్రతికూలంగా అంచనా వేసింది. దేశవ్యాప్తంగా కరోనా వ్యాప్తిని దృష్టిలో ఉంచుకుని పలు ఆంక్షలు కొనసాగుతుండటంతో ఆర్థిక పునరుజ్జీవనానికి ఆలస్యమవుతోందని ఏజెన్సీ వెల్లడించింది.

అత్యధికంగా జెట్ (JET) ఇంధన దారుణంగా పడిపోయిందని, ఆగష్టు (August)నాటికి ఎనిమిది నెలల్లో సగటు వినియోగం 46.6 శాతం పడిపోయిందని సంస్థ తెలిపింది. అత్యవసర విమానాలు, ఔషధాలకు వాడే కార్గో (cargo) విమానాలను మినహాయించి.. మిగిలిన అన్ని ప్రయాణ విమానాలను నిషేధించడంతో డిమాండ్ 91.4 శాతం తగ్గిందని సంస్థ పేర్కొంది. ఇక, ఎల్‌పీజీ (LPG) గ్యాస్ మాత్రమే సానుకూలంగా ఉందని, ఇప్పటివరకు ఎల్‌పీజీ డిమాండ్ ఏడాది ప్రాతిపదికన 4.3 శాతం పెరిగిందని ఏజెన్సీ వెల్లడించింది.


Next Story

Most Viewed