- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
గ్లోబల్ ఈ-కామర్స్‌లో భారత్‌కు తొమ్మిదో స్థానం!
దిశ, వెబ్‌డెస్క్: కొవిడ్-19 మహమ్మారి భారత ఆర్థికవ్యవస్థను తీవ్రంగా దెబ్బ తీసినప్పటికీ, ప్రస్తుత ఏడాది ఏప్రిల్ తర్వాత దేశీయ ఈ-కామర్స్ రంగం అత్యంత వేగంగా వృద్ధిని సాధించింది. పయనీర్ నివేదిక ప్రకారం..భారత ఈ-కామర్స్ రంగం ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా 9వ స్థానంలో ఉంది. కరోనా వైరస్ వ్యాప్తి సమయంలో సంపూర్ణ, పాక్షిక లాక్‌డౌన్ విధించిన సమయంలో ఆన్‌లైన్ షాపింగ్ వినియోగదారుల ఎంపికలో కొత్త రియాలిటీగా మారిందని నివేదిక పేర్కొంది. ఈ ఏడాదిలో కేవలం కొన్ని నెలల వ్యవధిలో ఈ-కామర్స్ రంగం దశాబ్ద వృద్ధిని సాధించింది.
అలాగే, ప్రపంచవ్యాప్తంగా మొదటి 10 దేశాల జాబితాలో భారత్ స్థానం మెరుగుపడింది. ప్రపంచ ర్యాంకింగ్స్‌లో ప్రస్తుతం చైనా తొలిస్థానంలో ఉండగా, అమెరికా, హాంకాంగ్, దక్షిణ కొరియా, యూకే, ఉక్రెయిన్, వియత్నాం ఉండగా, భారత్ తర్వాత పదో స్థానంలో నిలిచింది. చాలామంది భారతీయులు ఆన్‌లైన్ షాపింగ్ ఎక్కువగా చేయడంతో భారత ఈ-కామర్స్ రంగం తక్కువ వ్యవధిలో ఊహించని వృద్ధిని సాధించింది. రిలయన్స్ సంస్థల్లో ఫేస్‌బుక్ వంటి గ్లోబల్ కంపెనీ ఇన్వెస్ట్ చేయడం, గూగుల్ తన పెట్టుబడుల వ్యూహాన్ని ప్రకటించడం, రిలయన్స్ రిటైల్ విస్తరణలో భాగంగా ఫ్యూచర్ గ్రూపును కొనుగోలు చేయడం వంటి పరిణామాలు దేశీయ ఈ-కామర్స్ వృద్ధికి దోహదపడ్డాయని నివేదిక వెల్లడించింది.