యూకేలో భారతీయ విద్యార్థి అనుమానాస్పద మృతి

by vinod kumar |

ఇంగ్లండ్‌లో భారతీయ విద్యార్థి మృతి చెందాడు. పూణేకు చెందిన సిద్ధార్థ్ ముర్కుంబి(23) లండన్‌లోని లాంకషైర్ యూనివర్సిటీలో మార్కెటింగ్ కోర్సు చదువుతుండగా గత నెల 15న తప్పిపోయాడు. తాజాగా అతని మృతదేహం రిబ్బ్‌ల్ నది ఒడ్డున ఉండటాన్ని యూకే పోలీసులు గుర్తించారు. తమ కుమారుడు మరణవార్త తెలుసుకొని అతని తల్లిదండ్రులు తల్లడిల్లుతున్నారు. లాక్‌డౌన్ నేపథ్యంలో తాము యూకేకు రాలేమని, తమ కుమారుడి మృతదేహాన్ని భారత్‌కు పంపించాలని అతని తల్లిదండ్రులు యూకే ప్రభుత్వాన్ని కోరారు.
సిద్ధార్థ్ నదిలోకి దూకి ఆత్మహత్య చేసుకొని ఉంటాడని అక్కడి పోలీసులు అనుమానిస్తున్నారని మృతుడి తండ్రి శంకర్ తెలిపారు. మృతదేహాన్ని రాయల్ ప్రిస్టన్ ఆసుపత్రి మార్చురీకి తరలించినట్టు పోలీసులు వెల్లడించారన్నారు.

Tags: indian student, death, uk, pune

Advertisement
Next Story

Most Viewed