- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
ISROలో ఉద్యోగాల భర్తీకి మరో అవకాశం
దిశ, వెబ్ డెస్క్: ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్-ISRO గతంలో నర్స్, ల్యాబ్ టెక్నీషియన్, ఫైర్‌మెన్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. నాడు మార్చి 27ను చివరి తేదీగా ప్రకటించి దరఖాస్తులను స్వీకరించింది. అయితే, కరోనా మహమ్మారి వలన లాక్‌డౌన్ అమలులోకి వచ్చాక ఈ నియామక ప్రక్రియ వాయిదా పడింది.
ఈ నేపథ్యంలోనే దరఖాస్తు చేసుకోని వారికి మరో అవకాశం కల్పిస్తున్నట్లు ఇస్రో ప్రకటించింది. ఆ ఉద్యోగాలకు సంబంధించి మరోసారి అప్లికేషన్ విండో ఓపెన్ చేసింది. దరఖాస్తు ప్రక్రియను తిరిగి ప్రారంభించింది. 2020 ఆగస్ట్ 6వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు గడువు సమయంగా నిర్ణయించింది. ఈ నోటిఫికేషన్‌కు సంబంధించిన పూర్తి వివరాలను సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ అధికారిక వెబ్‌సైట్ https://www.shar.gov.in/ ను ఓపెన్ చేసి కెరీర్ సెక్షన్‌లో తెలుసుకోవచ్చునని తెలపారు. ఆసక్తి గల అభ్యర్థులు ఇదే వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేసుకోవాలి.
ఇస్రోలో మొత్తం 12 ఖాళీలు ఉండగా, అందులో నర్స్ బీ- 2, ల్యాబ్ టెక్నీషియన్ ఏ- 3, ఫైర్‌మ్యాన్ ఏ- 7 పోస్టులున్నాయి. విద్యార్హత ప్రకారం.. నర్స్ పోస్టుకు 10వ తరగతి పాస్‌తో పాటు మూడేళ్ల నర్సింగ్ కోర్స్ పూర్తి చేయాలి. ల్యాబ్ టెక్నీషియన్ పోస్టుకు 10వ తరగతితో పాటు డిప్లొమా ఇన్ మెడికల్ ల్యాబరేటరీ టెక్నాలజీ సర్టిఫికెట్ ఉండాలి. ఫైర్‌మ్యాన్ ఏ పోస్టుకు పదో తరగతి పాస్ అవసరరం. ఏజ్ లిమిట్ వారీగా చూస్తే నర్స్, ల్యాబ్ టెక్నీషియన్ పోస్టులకు 18 నుంచి 35 ఏళ్లు, ఫైర్‌మ్యాన్ పోస్టుకు 18 నుంచి 25 ఏళ్లు మధ్యలో ఉండాలి. కాగా, దరఖాస్తు రుసుము రూ.100గా నిర్ణయించారు.