- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
రిటైల్ రంగం కోలుకోవడం కష్టమే!
దిశ,వెబ్‌డెస్క్: దేశవ్యాప్తంగా కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో లాక్‌డౌన్ వల్ల దేశీయ రిటైల్ రంగానికి 40 రోజుల్లో రూ. 5.5 లక్షల కోట్ల నష్టం వాటిల్లినట్టు అఖిల భారత ట్రేడర్ల సమాఖ్య(సీఏఐటీ) ప్రకటించింది. రిటైల్ రంగంలో దాదాపు 7 కోట్ల మంది వ్యాపారులున్నారు. రిటైల్ వ్యాపారం పరిమాణం ఒకరోజుకు రూ. 15,000 కోట్లు. ఈ మొత్తం నష్టాన్ని వ్యాపారులు భరించాల్సి ఉంది. వైరస్ వల్ల రానున్న మరో 3 నెలల్లో 20 శాతానికి పైగా వ్యాపారాలు మూతపడే పరిస్థితి నెలకొంటుందని ట్రేడర్ల సమాఖ్య ఆందోళన వ్యక్తం చేసింది. ఈ రంగంలోని వ్యాపారులను ఆదుకోవడానికి కేంద్ర ఉద్దీపన ప్యాకేజీ అత్యవసరమని సమాఖ్య కార్యదర్శి ప్రవీణ్ ఖండేల్వాల్ తెలిపారు.
2.5 కోట్లమందిపై ప్రభావం..
‘లాక్‌డౌన్ పరిణామాలతో దేశవ్యాప్తంగా ఉన్న 1.5 కోట్ల మంది తమ వ్యాపారాలను మూసేసుకోవాల్సిన దుస్థితి ఏర్పడింది. 40 రోజుల సుదీర్ఘ లాక్‌డౌన్ వల్ల రోజుకు రూ. 15 వేల కోట్లున్న వ్యాపార విలువ.. మొత్తం రూ. 5.5 లక్షల కోట్ల నష్టాన్ని మూటగట్టుకుందని ప్రవీణ్ వివరించారు. అంతేకాకుండా ఈ వ్యాపారాలపై ఆధారపడిన 75 లక్షల మంది చిన్న చిన్న వ్యాపారులకు ఈ ముప్పు తప్పదని, దేశంలో ఉన్న సుమారు 2.5 కోట్ల మంది సూక్ష్మ, చిన్న వ్యాపారులపై దీని ప్రభావం స్పష్టం కనబడుతోంది. వారిని ఆదుకోవాల్సిన అవసరముందని’ ప్రవీణ్ వెల్లడించారు.
ఎప్పటికి కోలుకునేను..
చరిత్రలో ఇలాంటి ఉత్పాతాన్ని అనుభవించకపోవడం వల్ల ప్రస్తుత కరోనా పరిస్థితులను తట్టుకునే బలం వ్యాపారులకు లేదని, అంతేకాకుండా వ్యాపారులు తమ ఉద్యోగులకు జీతాలు చెల్లిస్తున్నారు, వారి దుకాణాలకు అద్దెలు కూడా చెల్లిస్తున్నారు. రాబడి సున్నా ఉన్నప్పటికీ ఈ చెల్లింపులను ఆపలేరు. ఇంతటి కష్టంలో వ్యాపారులను ఆదుకోవాల్సిన బాధ్యత తీసుకోవాలని సీఏఐటీ పేర్కొంది. వినియోగదారులు సైతం లాక్‌డౌన్ పరిస్థితులను అంచనా వేస్తూ ఖర్చులు తగ్గించుకున్నారు. పైగా, వారి దగ్గర ఖర్చు చేయడానికి అవసరమైన ఆదాయం కూడా లేదని, ఈ క్రమంలో వ్యాపారాలు, వ్యాపారులు మునుపటి స్థితికి రావడానికి కనీసం 6 నుంచి 9 నెలల సమయం పట్టేలా ఉంది. ఇదివరకే ఆర్థికవ్యవస్థ మాంద్యంలో ఉంది, అన్ని రంగాల్లోనూ డిమాండ్ మందగించింది. ఇప్పుడు కరోనా వైరస్ వల్ల ఆర్థిక వ్యవస్థ ఎన్నాళ్లకు కోలుకుంటుందో ఊహించలేమని సీఏఐటీ నివేదిక తెలిపింది.
చెల్లింపుల భారం…
మొత్తం శ్రామిక శక్తిలో మూడింత ఒక వంతు వ్యాపార రంగంలోనే ఉన్నారు. దేశ జీడీపీలో 40 శాతం కంటే అధికంగా ఉన్నటువంటి కార్పొరేటేతర రంగాన్ని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిర్వహించాచాలి. కానీ అలా చేయకపోవడం బాధాకరం. వ్యాపారులకు బ్యాంకు వడ్డీలు చెల్లించడం, అద్దె కట్టడం, జీతాలివ్వడం తప్పదని, రాబడి ఏ మాత్రం లేనప్పుడు మూలధనంతో ఎన్నాళ్లని నెట్టుకురాగలరని ప్రవీణ్ ప్రశ్నించారు.
మద్యం ఎందుకిపుడు..?
తాజాగా, లాక్‌డౌన్ కొనసాగుతుందని చెబుతూనే, మద్యం దుకాణాలకు సడలింపు ఇవ్వడాన్ని సీఏఐటీ వ్యతిరేకించింది. కేంద్రం నిర్ణయంతో పాటు రాష్ట్రాలు గత 40 రోజులుగా కొనసాగిస్తున్న లాక్‌డౌన్ లక్ష్యాలు, ప్రయోజనాలు వృధా అయ్యే ప్రమాదముందని వివరించింది. ఈ నిర్ణయం కరోనా కేసులు పెరగడానికి దోహదపడుతుందని హెచ్చరించింది. అదే సమయంలో మద్యం దుకాణాలకు అనుమతిచ్చి, సాధారణ వ్యాపారాలను లాక్‌డౌన్ పాటించమని చెప్పడం సరైన నిర్ణయం కాదని సీఏఐటీ చెబుతోంది.
Tags: Cait, Cait On Indian Retailers, Indian Retailers Losses, Traders Body On Liquor Shops