- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
2024 నాటికి రూ. 95 లక్షల కోట్లకు రిటైల్ రంగం!
దిశ, వెబ్‌డెస్క్: భారత్‌లో అత్యంత వేగంగా విస్తరిస్తున్న రిటైల్ పరిశ్రమలో మార్పులు కూడా అంతే వేగంగా జరుగుతున్నాయి. ముఖ్యంగా దేశీయ వినియోగదారుల ఆలోచనలు మారడంతో దుకాణాదారులను ఆకర్షించేందుకు రిటైల్ దిగ్గజాలు పోటీ పడుతున్నాయి. దీనికి తోడు కరోనా మహమ్మారి ఆందోళనల తర్వాత చాలామంది రద్దీగా ఉండే దుకాణాల కంటే శుభ్రమైన సూపర్ మార్కెట్లను లేదా ఆన్‌లైన్ ఆర్డర్లను ఎంచుకుంటున్నారు. తాజాగా ఫారెస్టర్ రీసెర్చ్ సేకరించిన వివరాల ప్రకారం…భారత రిటైల్ మార్కెట్ విలువ గతేడాది సుమారు రూ. 64.4 లక్షల కోట్లుగా ఉంది. ఇందులో కిరాణా రిటైల్ విలువ రూ. 44.3 లక్షల కోట్లు. 2024 నాటికి మొత్తం రిటైల్ మార్కెట్ విలువ సుమారు రూ. 95 లక్షల కోట్లకు చేరుకోవచ్చని అంచనా వేసింది.
ఈ-కామర్స్ వృద్ధి వేగం 30 శాతం..
అదేవిధంగా, దేశీయంగా చాలామంది వినియోగదారులు ఎలక్ట్రానిక్స్ నుంచి కిరాణా వస్తువుల వరకు షాపింగ్ చేసేందుకు ఈ-కామర్స్ వైపు మొగ్గు చూపుతున్నారు. ఆన్‌లైన్ డిస్కౌంట్లు, దేశవ్యాప్తంగా వేగవంతమైన డెలివరీ సేవల వృద్ధితో ఈ-కామర్స్ పరిశ్రమ వేగంగా వృద్ధి సాధిస్తోంది. అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ లాంటి సంస్థలు మార్కెట్లో అధిపత్యం చెలాయిస్తుండగా, చిన్న స్టార్టప్‌లు పాల వంటి నిత్యావసరాల డెలివరీ సేవల కోసం యాప్‌లను తీసుకొస్తున్నాయి. ప్రస్తుత గణాంకాల ప్రకారం..దేశీయ రిటైల్ మార్కెట్లో ఈ-కామర్స్ 5-6 శాతం వాటాను కలిగి ఉంది. ఇది అత్యంత వేగవంతమైన వృద్ధి. 2019లో ఈ-కామర్స్ మార్కెట్ విలువ రూ. 2.19 లక్షల కోట్లుగా ఉండగా, 2026 నాటికి ఇది 30 శాతం వార్షిక వృద్ధితో రూ. 14.6 లక్షల కోట్లకు విస్తరిస్తుందని ఇన్వెస్ట్ ఇండియా అంచనా వేసింది. దేశ జీడీపీలో రిటైల్ మార్కెట్ 10 శాతం వాటాను, దేశ ఉపాధిలో 8 శాతం వాటాను కలిగి ఉంది.