- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
జపాన్ ప్రభుత్వంపై ఐవోఏ అసంతృప్తి
దిశ, స్పోర్ట్స్: ఇండియా నుంచి టోక్యో ఒలింపిక్స్ కోసం వచ్చే అథ్లెట్లు, అధికారులు, ఇతర సిబ్బంది ప్రతీ రోజు కోవిడ్ పరీక్షలు చేయించుకోవాలని జపాన్ ప్రభుత్వం ఆదేశించడంపై ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్ (ఐవోఏ) తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. ఇండియా నుంచి బయలుదేరడానికి వారం రోజుల ముందు నుంచే ఈ పరీక్షలు చేయించుకోవాలని.. టోక్యో చేరిన తర్వాత మూడు రోజుల పాటు ఇతర దేశాలకు చెందిన ఏ అథ్లెట్, అధికారిని కలవ కూడదని జపాన్ ప్రభుత్వం నిబంధన విధించింది. ఇండియాతో పాటు మరో 10 దేశాలకు ఈ నిబంధనలు వర్తిస్తాయని జపాన్ పేర్కొన్నది.
ఇది సమయోచితం కాదని.. ఈ నిబందనలు ప్రత్యేకంగా 11 దేశాలకే వర్తింపజేయడం వివక్ష కిందకు వస్తుందని ఐవోఏ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నది. గతంలో ఇండియాలో రోజుకు 3 లక్షల కోవిడ్ కేసులు నమోదు అయ్యేవి. కానీ ప్రస్తుతం ఆ సంఖ్య 60 వేలకు తగ్గింది. ఇండియాతో పాటు ఆఫ్గనిస్తాన్, మాల్దీవ్స్, నేపాల్, పాకిస్తాన్, శ్రీలంక దేశాలకు చెందిన అథ్లెట్లు, కోచ్‌లను గ్రూప్ 1గా పిలుస్తున్నారు. గ్రూప్ 1 దేశాల నుంచి వచ్చే వాళ్లు తప్పని సరిగా జపాన్ ప్రభుత్వ నిబంధనలు పాటించాలని ఆదేశాలు జారీ చేశారు.