కోవిడ్-19ఎఫెక్ట్.. ఇండియా అలర్ట్

by Shamantha N |
కోవిడ్-19ఎఫెక్ట్.. ఇండియా అలర్ట్
X

దేశంలో కోవిడ్-19(కరోనా) విజృంభిస్తుండటంతో కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా అలర్ట్ విధించింది. కేంద్రం సూచన మేరకు రాష్ట్రాలు కూడా అప్రమత్తమయ్యాయి. ఈ వైరస్ విదేశాల నుంచి వచ్చే ప్రయాణికుల ద్వారా పెరుగుతుండటంతో వారిపై భారత్ ఆంక్షలు విధించింది. ఈ వైరస్ ఎఫెక్ట్ ముందుగా ఎయిర్ ఇండియాను తాకింది. దీంతో జర్మనీ, ఫ్రాన్స్, స్పెయిన్, దక్షిణ కొరియా, జర్మనీ, చైనా, ఇటలీ, టర్కీ వంటి దేశాలకు విమాన సర్వీసులను రద్దు చేసినట్టు పౌర విమానయాన శాఖ ప్రకటించింది. ముందస్తు చర్యల్లో భాగంగా ఇండో-నేపాల్ బార్డర్‌ను కూడా మూసేసారు. దేశ రాజధాని ఢిల్లీలో ఈ నెల31వరకు సినిమా హాల్స్, స్కూళ్లు, కాలేజీలు మూతపడనుండగా, సదస్సులు, సమావేశాలపై ఆప్ సర్కార్ నిషేధం విధించింది. యూపీలోనూ ఈనెల 22వరకు పాఠశాలలకు సెలవు యోగి సర్కార్ సెలవులు ప్రకటించింది. అదే బాటలో బీహార్, ఛత్తీస్‌గఢ్, కర్ణాటక రాష్ట్రాలు కూడా నడవనున్నాయి. ఇక దేశ ఆర్థిక రాజధాని ముంబాయిలో కరోనా ప్రభావం తీవ్రంగా పడింది. నవీ ముంబాయి,పూణె, నాగపూర్, పింప్రి, చించువాడ్లో ఈ రోజు అర్ధరాత్రి నుంచే పాఠశాలలు, మాల్స్, జిమ్ సెంటర్లు, మూవీ థియేటర్స్ బంద్ కానున్నాయి. సుప్రీంకోర్టుపై కూడా ఈవైరస్ ప్రభావం పడ్డట్టు తెలుస్తోంది. కొంత మంది జడ్జిలు, లాయర్లు సెలవులపై వెళ్తున్నట్టు సమాచారం. ఇదిలాఉండగా భారత్‌లో ఇప్పటివరకు కరోనా పాజిటివ్ కేసులు 78కి చేరగా, ఒకరు మృతిచెందారు.

Tags: carona, india alrert, 6states announce emergency, schools and malls close

Advertisement

Next Story

Most Viewed