దేశంలో దూసుకుపోతున్న ఫుడ్ మార్కెట్.. వచ్చే ఏడాదికి ఎంత పెరుగుతుందంటే ?

by Harish |   ( Updated:2021-08-30 10:37:49.0  )
food-market
X

దిశ, వెబ్‌డెస్క్: భారత్‌లో ఆన్‌లైన్ విస్తరణ నేపథ్యంలో దేశీయ ఫుడ్ సర్వీసెస్ మార్కెట్ 2025 నాటికి 2 రెట్లు పెరుగుతుందని సోమవారం ఓ నివేదిక వెల్లడించింది. అమెరికా, చైనాతో పోలిస్తే ఇది అత్యధికమని, స్థూల సరుకుల విలువ 13 బిలియన్ డాలర్లు(రూ. 96 వేల కోట్ల)కు చేరుకునే అవకాశం ఉందని రెడ్‌సీర్ కన్సల్టింగ్ నివేదిక తెలిపింది. కొవిడ్ మహమ్మారి పరిస్థితుల కారణంగా ఈ పరిశ్రమ దెబ్బతిన్నప్పటికీ, ఆన్‌లైన్ మార్కెట్ పుంజుకోవడంతో వృద్ధి వేగవంతంగా ఉందని నివేదిక పేర్కొంది. రెడ్‌సీర్ నివేదిక వివరాల ప్రకారం.. ఇటీవల జొమాటో లాంటి ఫుడ్‌టెక్ సేవల సంస్థలు ఐపీఓకు వస్తున్నాయి. ఎక్కువ మొత్తంలో నిధులను సమీకరిస్తున్నాయి.

delivary

అంతర్జాతీయ ఆహార సేవల మార్కెట్‌తో పోలిస్తే దేశీయ మార్కెట్ కొంత వెనకబడినప్పటికీ, రానున్న రోజుల్లో ఇది మరింత వృద్ధి సాధిస్తుందని నివేదిక వివరించింది. ఈ మధ్య కాలంలో దేశీయ ఆహార మార్కెట్ విస్తరణను గమనిస్తే, 2030 నాటికి భారత్ మూడో అతిపెద్ద వినియోగదారుల మార్కెట్‌గా ఉండొచ్చు. డిజిటల్ వినియోగం తోడవడం ద్వారా ఆన్‌లైన్ ఫుడ్ డెలివరీలు ఇంకా పెరగనున్నాయి. చిన్న నగరాల్లో వ్యాపించడమే కాకుండా, బ్రాండెడ్ ఆహార సేవలు, ఆన్‌లైన్ ప్లాట్‌ఫామ్‌ల ద్వారా స్వతంత్ర రెస్టారెంట్లు మరింత వృద్ధి సాధించవచ్చు. కొంతమేర సవాళ్లను ఎదుర్కొంటున్నప్పటికీ ఈ మార్కెట్ 2025 నాటికి 14 శాతం వార్షిక వృద్ధి సాధించనుంది.

Advertisement

Next Story