'భారత ఆర్థిక వ్యవస్థ వేగంగా కోలుకుంటోంది'

by Harish |
భారత ఆర్థిక వ్యవస్థ వేగంగా కోలుకుంటోంది
X

దిశ, వెబ్‌డెస్క్: భారత ఆర్థిక వ్యవస్థ ఊహించిన దానికంటే వేగంగా కోలుకుంటుందని అంతర్జాతీయ పరిశోధనా సంస్థ ఆక్స్‌ఫర్డ్ ఎకనామిక్స్ వెల్లడించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసికంలో ద్రవ్యోల్బణం సగటున 6 శాతానికి మించి ఉంటుందని, డిసెంబర్ ద్రవ్య విధాన సమీక్షలో ఆర్‌బీఐ పాలసీ రేట్లను యదాతథంగా కొనసాగించవచ్చని ఆక్స్‌ఫర్డ్ ఎకనామిక్స్ అభిప్రాయపడింది.

‘వినియోగదారుల ద్రవ్యోల్బణం అక్టోబర్‌లో గరిష్ఠానికి చేరుకుంది. ఇంధనం మినహా అన్నిటి ధరలు పెరుగుదలను ఎదుర్కొంటున్నాయి. నాలుగో త్రైమాసికంలో ద్రవ్యోల్బణం గరిష్ఠ స్థాయిని సూచిస్తున్నప్పటికీ, వచ్చే ఏడాదిపై భరోసాను కలిగి ఉన్నాము’ అని ఆక్స్‌ఫర్డ్ ఎకనామిక్స్ పేర్కొంది. కాగా, అక్టోబర్‌లో ఆహార ద్రవ్యోల్బణం ఆరున్నర సంవత్సరాల గరిష్ఠంగా 7.61 శాతానికి పెరిగింది. ఆర్‌బీఐ లక్ష్యానికి ఇది చాలా అధికం. రిటైల్ ద్రవ్యోల్బణం సెప్టెంబర్‌కు 7.27 శాతంగా నమోదైన సంగతి తెలిసిందే.

Advertisement

Next Story

Most Viewed