- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
2021లో భారత ఆర్థిక వ్యవస్థ వృద్ధి 7.3 శాతం :యూఎన్
దిశ, వెబ్‌డెస్క్: 2020 ఏడాదికి సంబంధించి భారత ఆర్థికవ్యవస్థ 9.6 శాతం కుదించుకుపోతుందని, కొవిడ్-19ను నియంత్రించేందుకు విధించిన లాక్‌డౌన్ వంటి పరిణామాల కారణంగా వినియోగం క్షీణించడమే దీనికి కారణమని యునైటెడ్ నేషన్స్(యూఎన్) నివేదిక తెలిపింది. అయితే, 2021లో వృద్ధి కోలుకుని 7.3 శాతానికి పెరుగుతుందని అంచనా వేస్తున్నట్టు నివేదిక అభిప్రాయపడింది. గతేడాది ప్రపంచ ఆర్థికవ్యవస్థ సైతం 4.3 శాతం తగ్గిందని, ఇది 2009 ప్రపంచ ఆర్థిక సంక్షోభం కంటే రెండున్నర రెట్లు ఎక్కువ. 2021లో 4.7 శాతంతో కోలుకోవడం ద్వారా 2020లోని నష్టాలను పూడ్చుకోగలదని ‘ప్రపంచ ఆర్థికవ్యవస్థ పరిస్థితులు, అవకాశాలు’ పేరుతో యూఎన్ విడుదల చేసిన నివేదిక వెల్లడించింది.
కరోనా మహమ్మారి కారణంగా దక్షిణాసియాలోని ప్రాంతాలు తీవ్రంగా దెబ్బతిన్నాయని, ముఖ్యంగా భారత్ చరిత్రలో అతిపెద్ద ఆర్థిక క్షీణతను చవిచూసిందని యూఎన్ వివరించింది. 2020లో భారత ఉత్పత్తి దాదాపు 10 శాతం పడిపోయిందని పేర్కొంది. ‘మెరుగైన పాలసీ విధానాలు, ప్రభావవంతమైన, స్థిరమైన భవిష్యత్తు పెట్టుబడులు ప్రస్తుత పరిస్థితుల్లో అవసరమని యూఎన్ సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెరస్ చెప్పారు. 2020 ఏడాదికి 9.6 శాతం కుదించుకుపోతుందని, ఇది 2021లో 7.3 శాతం వృద్ధిని సాధిస్తుందని, అయితే 2022లో తిరిగి 5.9 శాతానికి మందగించే అవకాశాలున్నట్టు ఆయన వెల్లడించారు.