వచ్చే ఆర్థిక సంవత్సరానికి వృద్ధి సానుకూలం!

by Harish |
వచ్చే ఆర్థిక సంవత్సరానికి వృద్ధి సానుకూలం!
X

దిశ, వెబ్‌డెస్క్: కొవిడ్-19 వ్యాప్తి కారణంగా దెబ్బతిన్న ఆర్థికవ్యవస్థ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం జులై-సెప్టెంబర్ త్రైమాసికం నుంచి తిరిగి ట్రాక్‌లోకి రావడం మొదలైందని కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ చెప్పారు. ప్రభుత్వం ఆర్థికవ్యవస్థ పునరుద్ధరణకు అనేక చర్యలు తీసుకుందని, రెండో త్రైమాసికం నుంచి తిరిగి పుంజుకుంటోందని తెలిపారు. కంపెనీల కార్యదర్శులతో జరిగిన ఓ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. అక్టోబర్, నవంబర్ నెలల్లో జీఎస్టీ వసూళ్లు రూ. లక్ష కోట్లకు పైగా వసూలవడం సానుకూల పరిస్థితులను సూచిస్తోందన్నారు.

డిసెంబర్ త్రైమాసికంలో మందగమనం నుంచి ఆర్థికవ్యవస్థ బయటకు వస్తుందా అనే మాటకు సమాధానం ఇచ్చిన ఆయన.. కరోనా సంక్షోభాన్ని పరిష్కరించేందుకు భారత్ సరైన చర్యలు తీసుకుందన్నారు. 2021-22 ఆర్థిక సంవత్సరంలో భారత ఆర్థిక వ్యవస్థ 8.5 శాతానికి పెరుగుతుందని అంతర్జాతీయ రేటింగ్ ఏజెన్సీలు అంచనా వేస్తున్నాయని, అభివృద్ధి చెందుతున్న దేశంలో ఆర్థికవ్యవస్థ వృద్ధి మెరుగ్గా ఉంటుందని చెప్పారు.

Advertisement

Next Story