స్పెయిన్ వెళ్లిన బాక్సర్ల బృందం

by Shyam |
Boxers
X

దిశ, స్పోర్ట్స్: బాక్సమ్ ఇంటర్నేషనల్ టోర్నమెంట్‌లో పాల్గొనేందుకు 14 మందితో కూడిన బాక్సర్ల బృందం ఆదివారం బయలుదేరి స్పెయిన్ వెళ్లింది. స్టార్ బాక్సర్ మేరీకోమ్ భారత జట్టుకు నేతృత్వం వహించనున్నది. స్పెయిన్‌లోని క్యాస్టలోన్‌లో మార్చి 1 నుంచి 7 వరకు ఈ టోర్నీ జరుగనున్నది. భారత బృందంలో 8 మంది పురుష, ఆరుగురు మహిళా బాక్సర్లు ఉన్నారు. 19 దేశాలకు చెందిన బాక్సర్లు ఈ టోర్నీలో తలపడనున్నారు. గత ఏడాది జోర్డాన్‌లో జరిగిన ఆసియన్ ఒలంపిక్ క్వాలిఫయర్స్ తర్వాత భారత బృందం తిరిగి రింగ్‌లోకి అడుగుపెట్టడం ఇదే తొలిసారి.

Advertisement

Next Story