వీడియో KYC సదుపాయాన్ని ప్రారంభించిన ఇండియన్ బ్యాంక్ ..

by Harish |
వీడియో KYC సదుపాయాన్ని ప్రారంభించిన ఇండియన్ బ్యాంక్ ..
X

దిశ, వెబ్‌డెస్క్: దేశీయ ప్రభుత్వ రంగ ఇండియన్ బ్యాంకులో కొత్తగా ఖాతా తెరవాలనుకునే వినియోగదారుల కోసం వీడియో KYC సదుపాయాన్ని ప్రారంభిస్తున్నట్టు మంగళవారం వెల్లడించింది. ‘వీడియో-ఆధారిత కస్టమర్ ఐడెంటిఫికేషన్ ప్రాసెస్(వీసీఐసీ)’ టెక్నాలజీ ద్వారా ఈ కొత్త సౌకర్యాన్ని అందిస్తున్నామని బ్యాంకు తెలిపింది. దీనివల్ల వినియోగదారులు ఖాతా తెరిచేందుకు నేరుగా బ్యాంకు బ్రాంచ్‌కు రావాల్సిన పని ఉండదని పేర్కొంది. వీడియో KYC సదుపాయం కోసం జియోమ్ బిజినెస్ సొల్యూషన్స్‌తో కలిసి టెక్నాలజీని అభివృద్ధి చేశామని, కస్టమర్లకు ఖాతా తెరవడం సులభతరం అవుతుందని బ్యాంకు వివరించింది.

ఈ ప్రక్రియ పూర్తయిన తర్వాత వినియోగదారులు నమోదు చేసిన చిరునామాకు చెక్‌బుక్, ఏటీఎమ్ కార్డ్ పోస్ట్ చేయబడుతుందని, అకౌంట్ ఓపెన్ చేసే సమయంలో అవసరమైన మినిమమ్ బ్యాలెన్స్‌ను ఆన్‌లైన్ విధానంలో బదిలీ చేయవచ్చని తెలిపింది. వీడియో KYC పూర్తయిన తర్వాత మొబైల్ బ్యాంకింగ్ యాప్ నుంచి ఇతర సదుపాయాలను ఉపయోగించుకునే అవకాశం ఉంటుంది. ఆ తర్వాత దశల వారీగా ఇతర సేవలను వినియోగించవచ్చని బ్యాంకు వెల్లడించింది.

Advertisement

Next Story

Most Viewed