ఇండియన్ ఆర్మీ ఇన్నోవేషన్స్

by Shamantha N |
ఇండియన్ ఆర్మీ ఇన్నోవేషన్స్
X

దిశ, వెబ్‌డెస్క్ : దేశం కోసం సైనికులు చేస్తున్న త్యాగాలు వెలకట్టలేనివి. కాగా భారత సైన్యం పరాక్రమాన్ని, ధీరత్వాన్ని కొనియాడుతూ.. వారి సేవలను స్మరించుకుంటూ.. ఏటా జనవరి 15న ఇండియన్ ఆర్మీ డే (Indian Army day)ను నిర్వహించుకుంటున్న విషయం తెలిసిందే. ఈసారి కూడా దేశవ్యాప్తంగా ఘనంగా నిర్వహించుకున్నాం. అయితే ఢిల్లీలో నిర్వహించిన వేడుకలు మాత్రం స్పెషల్‌గా నిలిచాయి. అక్కడ స్వదేశీ టెక్నాలజీతో ఇండియన్ ఆర్మీ రూపొందించిన నూతన ఆవిష్కరణలను ప్రదర్శించడంతో పాటు సదరు ఆవిష్కర్తలను ఈ సందర్భంగా సత్కరించారు. ప్రపంచంలోనే మొట్టమొదటి బుల్లెట్ ప్రూఫ్ జాకెట్‌తో పాటు 4,500 మీటర్ల ఎత్తులో ఉండి రెండు గంటలపాటు శత్రువుల కదలికలను గుర్తించే డ్రోన్‌ను డిస్‌ప్లేలో ఉంచారు.

ఏదేని రహస్య ప్రదేశాలు, కొండలు, బిల్డింగ్స్‌లో దాక్కున్న టెర్రరిస్టుల కదలికలు గుర్తించేందుకు ‘మైక్రోకాప్టర్(Microcopter)’ అనే డివైజ్‌ను లెఫ్టినెంట్ కల్నల్ జి.వై.కె.రెడ్డి రూపొందించారు. ఈ మైక్రో డ్రోన్ పనితీరును పారా మిలిటరీ స్పెషల్ ఫోర్సెస్ జమ్ము కశ్మీర్‌లో ట్రయల్ బేసిస్‌లో పరిశీలించాయి. డ్రోన్ డిజైన్‌ను ఇంకా ఇంప్రూవ్‌ చేసేందుకు ఆఫీసర్లు ప్రయత్నిస్తుండగా.. అనుకున్న స్థాయిలో ఇది పనిచేస్తే.. బార్డర్‌లోనూ ఈ డ్రోన్లను వాడాలని ఆలోచిస్తున్నారు. ప్రపంచంలోనే తొలి ఫ్లెక్సిబుల్ బుల్లెట్ ప్రూఫ్ జాకెట్‌ను మేజర్ అనూప్ మిశ్రా తయారు చేశారు. దీనిని మేల్, ఫీమేల్ ఎవరైనా ఉపయోగించొచ్చు. ఐడియాస్ అండ్ ఇన్నోవేషన్ కంపెండియం 2021లో భాగంగా వీటిని పరేడ్‌లో ప్రదర్శనకు ఉంచినట్లు ఆర్మీ ఆఫీసర్లు తెలిపారు. ఈ ఆవిష్కరణలకు సంబంధించిన ఫొటోలను ఇండియన్ ఆర్మీ ఏడీజీపీఐ విభాగం ఫేస్‌బుక్ వేదికగా షేర్ చేసింది.

photo: https://thelogicalindian.com/h-upload/2021/01/15/188984-armyweb.jpg

Advertisement

Next Story