పోలీసు అధికారి హత్య.. రీవెంజ్ తీర్చుకున్న ఇండియన్ ఆర్మీ

by Ramesh Goud |
Encounter
X

దిశ, వెబ్ డెస్క్ : జమ్మూకశ్మీర్‌లో టెర్రరిస్టులు మళ్లీ రెచ్చిపోతున్నారు. అశాంతి, అల్లర్లు సృష్టించేందుకు కశ్మీరీ పండిట్లను బెదిరించి వారి ఆస్తులను స్వాధీనం చేసుకుంటున్నారు. దీంతో పండిట్లు జమ్మూకు వలస వెళ్తున్నారు. ఈ క్రమంలో జరిగిన విధ్వంసంలో ఉగ్రవాదులు ఓ పోలీసు అధికారిని హతమార్చారు. దీంతో రంగంలోకి దిగిన భద్రతా బలగాలు పొలీసు అధికారి మరణానికి కారణమైన ఉగ్రవాదిని శుక్రవారం మట్టుబెట్టారు.

శ్రీనగర్ సమీపంలోని జెమినా వద్ద జరిగిన ఎదురుకాల్పుల్లో టెర్రరిస్టు హతమైనట్టు ఆర్మీ అధికారులు ధృవీకరించారు. సెప్టెంబర్ 12న ఉగ్రవాదుల కాల్పుల్లో సబ్ ఇన్‌స్పెక్టర్ అర్షిద్ అమరుడైన విషయం తెలిసిందే. ఇదిలాఉండగా, ఉగ్రావాదుల కోసం సెర్చ్ ఆపరేషన్ కొనసాగుతోందని ఆర్మీ అధికారులు తెలిపారు.


Next Story

Most Viewed