- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఉబెర్ కప్ క్వార్టర్ ఫైనల్‌లో భారత మహిళా షట్లర్లు
దిశ, స్పోర్ట్స్: భారత మహిళా బ్యాడ్మింటర్ ప్లేయర్లు డెన్మార్క్‌లో జరుగుతున్న 28వ ఉబెర్ కప్ క్వార్టర్ ఫైనల్‌లో ప్రవేశించారు. మంగళవారం స్కాట్లాండ్‌తో జరిగిన మ్యాచ్‌లలో 4-1తో విజయం సాధించి క్వార్టర్‌ఫైనల్ బెర్త్ కన్ఫార్మ్ చేసుకున్నారు. తొలుత మాల్విక బాన్సొద్ 13-21, 9-21 తేడాతో ఓడిపోయింది. అయితే ఆ తర్వాత మ్యాచ్‌లో అదితి 21-14, 21-8 తేడాతో రేచల్ సుగ్డెన్‌పై విజయం సాధించింది. దీంతో 1-1తో స్కోర్ సమం అయ్యింది. డబుల్స్ మ్యాచ్‌లో తానిషా క్రాస్టో – రుతపర్ణా పాండ 21-11, 21-8 తేడాతో జూలీ మాచ్‌పర్సన్ – సియారా టొర్రెన్స్‌పై గెలవడంతో 2-1 ఆధిక్యానికి దూసుకెళ్లింది. ఆ తర్వాతి మ్యాచ్‌లో తస్మిమ్ 21-15, 21-6 తేడాతో లారెన్ మిడిల్‌టన్‌పై గెలిచింది.
మరో డబుల్స్‌లో యువ జోడి త్రిసా జాలీ – గాయత్రి గోపీచంద్ (పుల్లెల గోపీచంద్ కూతురు) 21-8, 19-21, 21-10 తేడాతో గ్లిమోర్-ఎలెనార్‌పై విజయం సాధించారు. దీంతో భారత జట్టు 4-1 తేడాతో విజయం సాధించింది. ఆదివారం స్పెయిన్‌పై 3-2తో గెలిచిన భారత జట్టు .. తాజా విజయంతో గ్రూప్ బిలో రెండో స్థానంలో నిలిచింది. బుధవారం భారత జట్టు బలమైన థాయిలాండ్‌తో పోరాడనున్నది.