- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
ఏ పరిస్థితినైనా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నాం- రాజ్‌నాథ్ సింగ్
న్యూఢిల్లీ: ప్రస్తుతం అప్ఘానిస్తాన్‌లో నెలకొన్న పరిస్థితులు, భద్రతపై కొత్త ప్రశ్నలు లేవనెత్తుతున్నాయని కేంద్ర రక్షణమంత్రి రాజ్‌నాథ్ సింగ్ అన్నారు. కేంద్ర ప్రభుత్వం ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉందని నొక్కి చెప్పారు. జాతీయ భద్రతపై లాల్ బలరాందాస్ టండన్ స్మారక ప్రసంగంలో ఆయన మాట్లాడారు. స్వాతంత్రం తర్వాత దేశంలో అస్థిరమైన పరిస్థితులు నెలకొల్పడానికి అనేక వ్యతిరేక శక్తులు ప్రయత్నిస్తున్నాయని అన్నారు.
‘ముఖ్యంగా పాకిస్తాన్ నుంచి ఈ చర్యలు ఎక్కువగా ఉన్నాయి. కాగా 1965, 1971లో జరిగిన యుద్ధాల్లో పాక్ ఓడిపోయింది. ఈ ఓటములు పాకిస్తాన్ పూర్తి స్థాయిలో భారత్‌తో యుద్ధం చేయలేని స్థితిని రుజువు చేసింది’ అని పేర్కొన్నారు. భారత్‌తో నేరుగా యుద్ధం చేయలేని పాకిస్తాన్, రెండు విధానాలపై బలవంతంగా పని చేస్తుందన్నారు. అందులో ఒకటి అటామిక్ దాడుల మార్గమని, రెండోది నెమ్మదిగా ఒక్కొక్కరిని హతమార్చడమని తెలిపారు. కాగా ఈ ఏడాది ఫిబ్రవరిలో పాకిస్తాన్‌తో కాల్పులు విరమణ ఒప్పందం జరిగింది. విశ్వాసా ఘాతుకం అనేది ఇరు దేశాల మధ్య పెద్ద సమస్యగా మారింది.
కాగా, గత కొన్ని రోజులుగా సరిహద్దుల్లో ఎలాంటి కాల్పులు చోటు చేసుకోలేదని తెలిపారు. ఉరి సంఘటన తర్వాత జరిగిన సర్జికల్ స్ట్రైక్, పుల్వామ దాడి తర్వాత బాలకోట్ వైమానిక దాడులు వంటివి భారత్ సత్తాను చూపెట్టాయని అన్నారు. ఉగ్రవాదులపై ప్రతిదాడికి భారత్ ఏనాడు వెనకడుగు వేయలేదన్నారు. జమ్ముకశ్మీర్‌లో ఆర్టికల్ 370 రద్దు తర్వాత కేంద్ర పాలిత ప్రాంతంలో శాంతి, స్థిరత్వానికి మార్గం ఏర్పడిందన్నారు. కశ్మీర్‌లో మిగిలిపోయిన ఉగ్రవాదం త్వరలోనే ముగుస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.