- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఇండియా vs ఇంగ్లాండ్: టీమిండియా స్కోర్ 336/6
దిశ, వెబ్‌డెస్క్: ఇంగ్లాండ్ టూర్ ఆఫ్ ఇండియాలో భాగంగా మహారాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ స్టేడియం, పూణే వేదికగా జరుగుతున్న రెండో వన్డేలో టీమిండియా మంచి ఇన్నింగ్స్ ఆడింది. ఓపెనర్లు రోహిత్ శర్మ (25), శిఖర్ ధావన్ (4) విఫలమయ్యారు. ఇటువంటి సమయంలో వన్‌డౌన్ బ్యాట్స్‌మెన్ విరాట్ కోహ్లీ, టూ డౌట్ బ్యాట్స్‌మెన్ కేఎల్ రాహుల్ మంచి భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. ధాటిగా ఆడుతూ స్కోరు బోర్డును ముందుకు తీసుకెళ్లారు. ఇదే క్రమంలో ఇరువురు ఆటగాళ్లు హాఫ్ సెంచరీలను పూర్తి చేసుకున్నారు.
కానీ, 79 బంతుల్లో 3 ఫోర్లు 1 సిక్సర్ బాదిన కోహ్లీ 66 పరుగుల చేసి ఔట్ అయ్యాడు. 32వ ఓవర్‌లో ఆదిల్ రషీద్ వేసిన స్పిన్ బంతిని డిఫెన్స్ చేయబోయిన కోహ్లీ.. కీపర్ జోస్ బట్లర్‌కు క్యాచ్ ఇచ్చాడు. దీంతో 158 పరుగుల వద్ద కోహ్లీ పెవిలియన్ చేరాడు. ఆ తర్వాత రాహుల్‌కు రిషబ్ పంత్ పూర్తి సహాకారం అందించాడు. వరుసగా సిక్సర్లు బాది స్కోరు బోర్డును పరుగులెత్తించాడు.
కేఎల్ రాహుల్ సెంచరీ:
ఆది నుంచి బాల్ టూ బాల్ ఆడుతూనే సమయం చూసి బౌండరీలు బాదిన కేఎల్ రాహుల్ తన సెంచరీని పూర్తి చేసుకున్నాడు. మొత్తం 114 బంతుల్లో 7 ఫోర్లు, 2 సిక్సర్లతో 108 పరుగులు చేశాడు. ఇదే క్రమంలో 45వ ఓవర్‌లో టామ్ కర్రన్ వేసిన బంతిని షాట్ ఆడబోయిన రాహుల్ బౌండరీ వద్ద టోప్లే క్యాచ్ పట్టడంతో మైదానం వీడాడు. దీంతో నాలుగు వికెట్లు నష్టపోయేసరికి ఇండియా స్కోర్ 271గా ఉంది.
రిషబ్ పంత్.. ఆకాశమే హద్దు:
ఇక మిడిలార్డర్‌లో బ్యాటింగ్‌కు దిగిన రిషబ్ పంత్ ఇంగ్లాండ్‌పై ఎదురుదాడికి దిగాడు. ఆకాశమే హద్దుగా వరుస సిక్సర్లతో చెలరేగాడు. తొలి బంతి నుంచి చివరి బంతి వరకు బౌండరీలపైనే ఫోకస్ చేశాడు. కేవలం 40 బంతుల్లో 3 ఫోర్లు 7 సిక్సర్లతో 77 పరుగుల మెరుపు ఇన్నింగ్స్ చేశాడు. కానీ, 47వ ఓవర్‌లో టామ్ కుర్రాన్ వేసిన ఐదో బంతిని షాట్ ఆడబోయి జాసన్ రాయ్‌కి క్యాచ్ ఇచ్చి మైదానం వీడాడు. దీంతో 308 పరుగుల వద్ద టీమిండియా 5వ వికెట్‌ను కోల్పోయింది.
ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన హార్దిక్ 16 బంతుల్లో 1 ఫోర్ 4 సిక్సర్లతో 35 పరుగులు చేసి చివరి ఓవర్‌లో పెవిలియన్ చేరాడు.. కృనాల్ పాండ్యా 12, శార్దుల్ ఠాకూర్ 0 నాటౌట్‌గా నిలిచారు. దీంతో నిర్ణీత 50 ఓవర్లలో టీమిండియా 6 వికెట్ల నష్టానికి 336 పరుగులు చేసింది. ఇక 337 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగే ఇంగ్లాండ్ ఏ విధంగా రాణిస్తుందో వేచి చూడాల్సిందే.