అదే స్థాయికి చేరిన స్టాక్ మార్కెట్ విలువ

by Harish |
అదే స్థాయికి చేరిన స్టాక్ మార్కెట్ విలువ
X

దిశ, వెబ్‌డెస్క్: విదేశీ ద్రవ్యలభ్యత (Foreign liquidity) కారణంగా భారత షేర్ మార్కెట్ (Indian share market)విలువ తిరిగి కరోనాకు ముందున్న స్థాయికి చేరింది. ప్రస్తుత సంవత్సరం ఫిబ్రవరిలో స్టాక్ మార్కెట్ (Stock market) క్యాప్ 2 ట్రిలియన్ డాలర్లుగా ఉండేది. మళ్లీ 6 నెలల తర్వాత ఈ మార్కును మళ్లీ అందుకుంది. కొవిడ్-19 ప్రభావంతో మార్చిలో మార్కెట్లు దారుణంగా కుప్పకూలాయి.

మార్చి 23న 6 ఏళ్ల కనిష్ట స్థాయికి స్టాక్ మార్కెట్ (Stock market) పడిపోయింది. అయితే, తర్వాతి పరిణామాల్లో ప్రభుత్వం తీసుకున్న చర్య్లు, అంతర్జాతీయంగా (Internationally) పలు దేశాలు ప్రకటించిన ఉద్దీపన ప్యాకేజీ (Stimulus package)లతో కరోనా గండం నుంచి మార్కెట్లు (Markets) గట్టెక్కాయి. ఐదు నెలల కాలంలో సుమారు 48 శాతం రికవరీ అయినట్టు తెలుస్తోంది.

ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా 8 దేశాల స్టాక్ మార్కెట్లు (Stock markets) మాత్రమే 2 ట్రిలియన్ డాలర్లు అంతకంటే ఎక్కువ మార్కెట్ క్యాప్‌ (Market Cap)ను కలిగి ఉన్నాయి. ఇక, భారత్ 2017 మే నెలలో తొలిసారిగా ఈ జాబితాలో చేరింది. 2019 జనవరిలో స్టాక్ మార్కెట్ (Stock market) విలువ 2.15 ట్రిలియన్ డాలర్లుగా ఉండేది.

అయితే, ప్రస్తుతం ఈ మార్కుకు దగ్గరలోనే ఉంది. దీనికి మరికొంత సమయం పడుతుందని మార్కెట్ నిపుణులు (Market experts)అభిప్రాయపడుతున్నారు. మార్చికి ముందు ప్రపంచదేశాల్లో 7వ స్థానంలో ఉండగా, తర్వాత టాప్ 10 జాబితా నుంచి దిగజారింది. కరోనా వల్ల స్టాక్ మార్కెట్ (Stock market) విలువ కనిష్టంగా 1.31 ట్రిలియన్ డాలర్ల వరకు పడిపోయినప్పటికీ, తర్వాత ప్రభుత్వం మార్కెట్లోకి నగదును చొప్పించడంతో 2.33 బిలియన్ డాలర్లు వచ్చి చేరాయి.

Advertisement

Next Story