ఘర్షణలకు భారతే కారణం: చైనా

by vinod kumar |   ( Updated:2020-09-05 05:52:42.0  )
ఘర్షణలకు భారతే కారణం: చైనా
X

దిశ, వెబ్‌డెస్క్: సరిహద్దుల్లో ఘర్షణలకు భారత్ వైఖరే కారణమని చైనా ప్రకటన చేసింది. ఇండియా చర్యలతోనే ఇరుదేశాల మధ్య ఉద్రిక్తలు పెరుగుతున్నాయని పేర్కొంది. తమ సౌర్వభౌమ ప్రదేశం నుంచి ఒక్క అంగుళం కూడా వదులుకునేందుకు సిద్ధంగా లేమని తెలిపింది. షాంఘై సహకార సంస్థ రక్షణ మంత్రుల సమావేశానికి హాజరైన రాజ్‌నాథ్ సింగ్, చైనా రక్షణ మంత్రి ఫెంఘె విడిగా భేటీ అయ్యారు. ఈ సమావేశంలో ఘర్షణలకు ముందున్న పరిస్థితిని పునరుద్ధరించాలని భారత్ తెగేసి చెబుతున్నట్లు తెలుస్తుండగా.. డ్రాగన్ కంట్రీ మాత్రం తన చర్యలను సమర్థించుకుంటూ వెంటనే ఈ ప్రకటన చేసింది. మోడీ, జిన్‌పింగ్‌ మధ్య ఏకాభిప్రాయాన్ని ప్రస్తావించిన చైనా.. ఆ ఒప్పందాన్ని అమల్లో పెట్టాలని ఉచిత సలహా ఇచ్చింది. దీనిపై అదే రేంజ్‌లో స్పందించిన ఇండియా.. తమ సార్వభౌమాధికారం, ప్రాదేశిక సమగ్రతకు కట్టుబడి ఉంటామని ఘాటుగా రిప్లై ఇచ్చింది.

Advertisement

Next Story

Most Viewed