- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
వైమానిక దాడులకు భారత్ సంసిద్ధం
దిశ, వెబ్ డెస్క్: యుద్ధ విమానాలు రాఫేల్ ప్రవేశంతో భారత వైమానిక దళం శత్రుదేశాలకు దీటుగా ఉన్నదని, శత్రుదేశాల్లోకి చొచ్చుకెళ్లి దాడి చేసే సామర్థ్యం ఇప్పుడు భారత్ సొంతం అని ఎయిర్ చీఫ్ మార్షల్ ఆర్‌కేఎస్ భదౌరియా అన్నారు. ఆకస్మికంగా ఘర్షణలు చోటుచేసుకుంటే భారతే పైచేయి సాధిస్తుందని, చైనా పైచేయి సాధించే అవకాశమే లేదని వివరించారు.
భారత ఆర్మీ కీలక పొజిషన్లలో ఉన్నదని, ఇది భారత్‌కు కలిసొస్తుందని తెలిపారు. అంతేకాదు, రాఫేల్ ఆగమనంతో శత్రుదేశాలపై వైమానిక దాడులు చేయడానికి సంసిద్ధంగా ఉన్నామని, చైనాతో ఘర్షణలు దాడులు చేసుకునే స్థాయికి దారితీయలేదని అన్నారు. అందుకే భారత వైమానిక దళం ఎయిర్‌స్ట్రైక్ నిర్వహించలేదని వివరించారు.
పాకిస్తాన్, చైనాల మధ్య సాన్నిహిత్యం బలంగా ఉన్న సంగతి తెలిసిందే. అనేక విధాల్లో చైనాకు పాకిస్తాన్ సహకరిస్తున్నదని ఆయన వివరించారు. సరిహద్దులో ఇరుదేశాల నుంచి సవాళ్లు ఎదురవుతున్న తరుణంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. భారత్ టూ ఫ్రంట్‌లలోనూ యుద్ధానికి సిద్ధంగా ఉన్నదని చెప్పారు.