భారత్‌కు ఆహ్వనం పంపని రష్యా.. ఎందుకు..?

by Shamantha N |
భారత్‌కు ఆహ్వనం పంపని రష్యా.. ఎందుకు..?
X

న్యూఢిల్లీ: ఆఫ్ఘన్ పరిస్థితులపై ఖతార్ లో నిర్వహించబోయే ట్రోయికా చర్చల్లో భారతదేశానికి ఎటువంటి ఆహ్వనం అందలేదని తెలుస్తోంది. ఈ సమావేశానికి చైనా, పాకిస్తాన్, అమెరికాలను పిలవాలని రష్యా నిర్ణయించుకున్నట్లు సమాచారం. కాబూల్ లో తాలిబన్ల అరాచకాలు రోజు రోజుకి శృతి మించుతున్నందున ఆఫ్ఘన్ పై అవసరమైన కార్యచరణను ముమ్మరం చేయాలని రష్యా అనుకుంటోంది. అందులో భాగంగా ఈ సమావేశానికి కీలకమైన సరిహద్దు దేశాలతో పాటు అమెరికాను ఆహ్వనించామని క్రిమ్లిన్ వెల్లడించింది. ఈ నెల 11 వ తేదిన ఖతార్ లో చర్చలు జరగనున్నాయి. ఇంతకుముందు ఈ దేశాల మధ్య మార్చి 18, ఏప్రిల్ 30 మధ్య రెండు సార్లు చర్చలు జరిగాయి. ఆ సమావేశాలకు సైతం రష్యా, భారత్ ను ఆహ్వనించలేదు.

కాబూల్ ను ప్రశాంతంగా ఉంచడానికి తమ దగ్గర మాస్కో ప్రణాళిక ఉందని రష్యా వెల్లడించింది. గత నెల తాష్కెంట్ లో మాట్లాడిన రష్యా విదేశాంగమంత్రి సెర్గీలావ్ రోవ్ ‘ భారత్ ను కలుపుకుని ఆఫ్ఘన్ వ్యవహరాన్ని ముందుకు తీసుకువెళతామని’ వెల్లడించారు. అయితే ముందు ముందు జరగబోయే ట్రోయికా సమావేశంలో భారత్ ను కలుపుకుంటామని రష్యా అధికారులంటున్నారు. మేము అమెరికన్లతో పాటు మధ్య ఆసియా దేశాలు, భారత్, ఇరాన్ తో కలిసి ఆప్ఘన్ వ్యవహరం పై కలిసి పనిచేయాలనుకుంటున్నామని సెర్గీ మీడియాతో అన్నారు. ఆగస్టు ఆరవ తేదిన ఐక్యరాజ్య సమితి భద్రతామండలి, ఆఫ్ఘన్ సమస్య పై చర్చించనుందని భారత్ లోని కాబూల్ రాయబారి ఫరీద్ మాముండెజ్ అన్నారు. ఇది నిజంగా గొప్ప ముందడుగా ఆయన అభివర్ణించారు. తమ దేశంలో జరుగుతున్న అరాచకాలు ఆగాలంటే అంతర్జాతీయ సమాజం క్రియాశీలకంగా వ్యవహరించాలని అన్నారు. కాగా ఆగస్టు 31 నాటికి నాటో దళాలు పూర్తిగా ఆఫ్ఘన్ నుంచి వైదోలగనున్నాయి. కాబూల్ పునర్నిర్మాణంలో భారత్ ఇప్పటి వరకు 3 బిలియన్ డాలర్ల వరకు ఖర్చు చేసింది. అక్కడ పార్లమెంట్ భవనాన్ని, సాల్మ జలాశయం సహ కీలకమైన రోడ్డును నిర్మించి ఇచ్చింది.

Advertisement

Next Story

Most Viewed