- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
‘కరోనా నుంచి బయటపడాలంటే వృద్ధి అవసరం’
దిశ, వెబ్‌డెస్క్: 2021-22 ఆర్థిక సంవత్సరంలో భారత్ 10.5-11 శాతం వృద్ధి సాధించాల్సిన అవసరం ఉందని నీతి ఆయోగ్ వైస్-ఛైర్మన్ రాజీవ్ కుమార్ అన్నారు. కరోనా మహమ్మారి కారణంగా కలిగే భారీ దుష్ప్రభావాలను అధిగమించేందుకు ఈ మేరకు వృద్ధి కొనసాగింపు కావాలని ఆయన అభిప్రాయపడ్డారు. నేషనల్ సీఎస్ఆర్ నెట్‌వర్క్ నిర్వహించిన వర్చువల్ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన.. అనూహ్యంగా వచ్చిన కరోనా మహమ్మారిని నియంత్రించేందుకు ఇదివరకు దేశం సిద్ధంగా లేదని, భవిష్యత్తులో మరోసారి మహమ్మారిని ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాల్సిన అవసరం ఉందని రాజీవ్ కుమార్ తెలిపారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి ఆర్థికవ్యవస్థ 8 శాతం కుదించుకుపోయే అవకాశం ఉన్నట్టు రాజీవ్ చెప్పారు. ఆర్‌బీఐ 2021-22లో దేశ ఆర్థిక వృద్ధి 10.5 శాతంగా అంచనా వేస్తుండగా, ప్రధాన ఆర్థిక సలహాదారు కె.వి సుబ్రమణియన్ 11 శాతంగా వృద్ధిని అంచనా వేసిన సంగతి తెలిసిందే. దేశ ఆర్థికవ్యవస్థ కోలుకునే స్థాయిలో దూసుకుపోతోందని అన్నారు.