వాతావరణాంశాలకు ఐఎండీ యాప్ ‘మౌసమ్’

by Shamantha N |
వాతావరణాంశాలకు ఐఎండీ యాప్ ‘మౌసమ్’
X

న్యూఢిల్లీ: ఇండియన్ మెటియరలాజికల్ డిపార్ట్‌మెంట్(ఐఎండీ) వివరాలు అందించే మొబైల్ యాప్ ‘మౌసమ్’ను కేంద్ర ప్రభుత్వం లాంచ్ చేసింది. ఎప్పటికప్పుడు వాతావరణాంశాలను ప్రజలు తెలుసుకోవడానికి ఉపకరించే ఈ యాప్‌ను ఐఎండీ వ్యవస్థాపక వేడుకల సందర్భంగా కేంద్ర మంత్రి హర్షవర్ధన్ ఆవిష్కరించారు. దీంతో భారత్ సొంతంగా వెదర్‌కు సంబంధించిన యాప్‌ను రూపొందించుకున్నట్టయింది.

ఈ యాప్ 200 పట్టణాల్లోని తేమ, ఉష్ణోగ్రత, గాలి వేగంలాంటి వివరాలను రోజుకు ఎనిమిది సార్లు ఈ యాప్‌లో అప్‌డేట్ ఇస్తుంది. 450 పట్టణాలకు సంబంధించి గడిచిన రోజుతోపాటు వారం రోజుల వాతావరణ అంచనాలను అందుబాటులో ఉంచుతుంది. ప్రకృతి వైపరిత్యాలకు సంబంధించి వార్నింగ్‌లూ వెలువరుస్తుంది. ఈ యాప్ ద్వారా రాడార్ ఇమేజ్‌లను యాక్సెస్ చేసి వాతావరణ పరిస్థితులను తెలుసుకోవచ్చు. ‘మౌసమ్’ మొబైల్ అప్లికేషన్‌ను గూగుల్ ప్లే స్టోర్, యాపిల్ యాప్ స్టోర్‌లో అందుబాటులో ఉంటుందని ఎర్త్ సైన్సెస్ మినిస్ట్రీ తెలిపింది.

Advertisement

Next Story

Most Viewed