- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఐరాస భద్రతామండలి సభ్యదేశంగా భారత్
న్యూఢిల్లీ: ఐక్యరాజ్య సమితి భద్రతామండలి తాత్కాలిక సభ్యదేశంగా భారత్ ఏకగ్రీవంగా ఎన్నికైంది. ఇండియాతోపాటు మెక్సికో, ఐర్లాండ్, నార్వే దేశాలూ ఈ మండలికి బుధవారం ఎన్నికయ్యాయి. కాగా, ఆఫ్రికా దేశాలకు సంబంధించిన ఐదో సీటుకు ఎన్నిక జరగనుంది. ఈ సీటుకు కెన్యా, జిబౌటీ దేశాలు పోటీపడుతున్నాయి.
అయితే, ఈ మండలిలో భారత్ ఎన్నిక అనూహ్యమైందేమీ కాదు. ఆసియా-పసిఫిక్ కేటగిరీలో ఐరాస భద్రతా మండలి తాత్కాలిక సభ్యదేశ(2021-22) ఎన్నికలకు భారత్ సింగిల్‌గా పోటీ చేసింది. ఆసియా-పసిఫిక్ గ్రూప్‌లోని చైనా, పాకిస్తాన్ సహా 55 దేశాలు గతేడాదే భారత్‌కు సమ్మతిని ప్రకటించడం గమనార్హం. ఇప్పటి వరకు భారత్ ఏడుసార్లు ఎన్నికవ్వగా తాజాగా, ఎనిమిదో సారి భద్రతా మండలికి తాత్కాలిక సభ్యదేశంగా ఎన్నికైంది.
ఈ ఎన్నికపట్ల ప్రధాని మోడీ హర్షం వ్యక్తం చేశారు. భారత్‌ను ఎన్నుకున్నందుకు అంతర్జాతీయవర్గానికి కృతజ్ఞతలు తెలిపారు. విశేష అధికారాలుండే భద్రతా మండలి తాత్కాలిక సభ్యత్వం రెండేళ్లపాటు ఉంటుంది. దేశాలపై ఆంక్షలు విధించడం, బలగాల మోహరింపునకు సంబంధించిన కీలక నిర్ణయాలు ఈ మండలిలోనే జరుగుతాయి. ఇందులో ఐదు శాశ్వత దేశాలు అమెరికా, బ్రిటన్, ఫ్రాన్స్, చైనా, రష్యాలు వీటో అధికారాన్ని కలిగి ఉంటాయి. కాగా, పది తాత్కాలిక సభ్యదేశాలుంటాయి.