- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
కరోనా @ కోటిన్నర
న్యూఢిల్లీ : భారత్‌లో కరోనా మహమ్మారి ఉధృతి కొనసాగుతున్నది. దేశంలో మొత్తం కేసులు కోటిన్నర దాటాయి. గడిచిన 24 గంటల్లో దేశంలో 2,73,810 కేసులు నమోదుకాగా.. 1,619 మంది మృతి చెందారు. యాక్టివ్ కేసులు 19 లక్షలు (19,29,329) దాటాయి. కాగా, తాజా కేసులతో దేశంలో మొత్తం కేసుల సంఖ్య 1,50,61,919 కి చేరగా.. కరోనా బారిన పడి మృతి చెందిన వారి సంఖ్య 1,78,769 కి చేరింది. ఇదిలాఉండగా.. భారత్‌లో ఇప్పటివరకు (ఆదివారం సాయంత్రం నాటికి) 12,38,52,566 మందికి టీకా వేసినట్టు కేంద్ర వైద్య, ఆరోగ్య శాఖ వెల్లడించింది. దేశంలో రోజూవారీ కరోనా కేసులు 2 లక్షలు దాటడం ఇది వరుసగా ఐదోరోజు. కేసుల పెరుగుదల ట్రెండ్ చూస్తే మరో రెండ్రోజుల్లోనే రోజూవారీ కేసుల సంఖ్య మూడు లక్షల మార్కును దాటేలా కనిపిస్తున్నది. ప్రపంచంలో అమెరికాలో తప్ప మరేదేశం కూడా ఒక్కరోజులో 3 లక్షల కేసులను నమోదు చేయలేదు. త్వరలో భారత్ ఆ ఆందోళనకర మార్కును అదిగమించే అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయి.