భారత్, చైనాల మధ్య శాంతి చర్చలు

by Shamantha N |
భారత్, చైనాల మధ్య శాంతి చర్చలు
X

న్యూఢిల్లీ: సరిహద్దులో ఉద్రిక్తతలు సద్దుమణగడానికి భారత్, చైనాలు ప్రతివారం శాంతి చర్చలు జరపడానికి నిర్ణయించాయి. ఈ వర్కింగ్ మెకానిజం ఫర్ కన్సల్టేషన్ అండ్ కోఆర్డినేషన్(డబ్ల్యూఎంసీసీ) మీటింగ్‌ను వీడియో కాన్ఫరెన్స్ ద్వారా నిర్వహించడానికి నిర్ణయం తీసుకున్నట్టు ప్రభుత్వ టాప్ అధికారి ఒకరు తెలిపారు. ఈ సమావేశాలు ఇరుదేశాలకు చెందిన విదేశాంగ శాఖకు చెందిన అధికారుల అధ్యక్షతనలో జరుగనున్నాయి. చైనా అధికారులతో చర్చల ద్వారా సరిహద్దులో ఉద్రిక్తతలు తగ్గి, బలగాలు వెనక్కి మళ్లుతాయని ఆ అధికారి విశ్వాసం వ్యక్తం చేశారు. సరిహద్దు వెంబడి సుమారు 10వేల మంది చైనా జవాన్లు మోహరించిన తరుణంలో ఈ నిర్ణయం తీసుకోవడం గమనార్హం. ఇదివరకు జరిగిన చర్చల్లో ఉద్రిక్తతలు తగ్గడానికి సహకరిస్తామని చెబుతూనే క్షేత్రస్థాయిలో మాత్రం బలగాలను భారీగా మోహరిస్తూ సమస్యాత్మక సరిహద్దు ప్రాంతాల్లోకి చొచ్చుకొస్తున్న విషయం తెలిసిందే.

Advertisement

Next Story