- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
స్పెయిన్‌ను దాటేశాం..భారత్‌లో ఒక్కరోజే 9,971కేసులు
దిశ, న్యూస్‌బ్యూరో: దేశంలో కరోనా వైరస్ వ్యాప్తి తీవ్రతరమవుతోంది.ఆదివారం ఉదయం కేంద్ర ఆరోగ్య శాఖ బులెటిన్ ప్రకారం గడచిన24 గంటల్లో దేశవ్యాప్తంగా 9,971 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో ఒక్కరోజులోనే 10వేలకు అతి చేరువలో పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దేశంలోకి కరోనా ప్రవేశించినప్పటి నుంచి ఒక రోజులో నమోదైన అత్యధిక పాజిటివ్ కేసుల సంఖ్య ఇదే కావడం గమనార్హం. కొత్త కేసులతో కలిపి దేశంలో ఇప్పటివరకు నమోదైన మొత్తం కరోనా కేసులు 2,46,628కి చేరాయి. ఒక్కరోజే కరోనాతో 287మంది చనిపోగా దేశవ్యాప్తంగా 6,929 మంది వ్యాధితో మరణించారు. ఇప్పటివరకు 1,19,292 మంది కరోనా నుంచి కోలుకొని ఆస్పత్రుల నుంచి డిశ్చార్జి కాగా 1,20,406 మంది ప్రస్తుతం వ్యాధితో పోరాడుతున్నారు. కరోనా మొత్తం కేసుల్లో దేశం స్పెయిన్‌ను దాటి 5వ స్థానానికి చేరింది. దేశంలో కరోనా కేసులు చైనాతో పోలిస్తే మూడు రెట్లు అవడానికి దగ్గరగా ఉన్నాయి. మహారాష్ట్ర, తమిళనాడు, గుజరాత్ రాష్ట్రాల్లో కరోనా వ్యాప్తి రోజురోజుకూ తీవ్రమవుతోంది. దేశంలోనే ఇప్పటివరకు ఎక్కువ కేసులు నమోదైన మహారాష్ట్రలో ఒక్కరోజే 3007పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కొత్తగా రికార్డైన కేసులతో కలిపి మహారాష్ట్రలో కరోనా కేసుల సంఖ్య 85,975కి చేరింది. ఇక్కడ ఒక్కరోజులోనే 129 మంది కరోనా కారణంగా ప్రాణాలు కోల్పోవడంతో రాష్ట్రంలో మొత్తం కరోనా మరణాల సంఖ్య 3060కి చేరింది. రాజధాని ముంబైలో ఒక్కరోజే 1,421పాజిటివ్ కేసులు నమోదు కాగా 61 మంది కరోనాతో మరణించారు. దీంతో నగరంలో మొత్తం కేసుల సంఖ్య 48,549కి చేరింది. తమిళనాడులో ఒక్కరోజే 1515 కొత్త కేసులు నమోదవడంతో ఇక్కడ మొత్తం కేసుల సంఖ్య31,667కు చేరింది. రాష్ట్రంలో కరోనాతో ఒక్కరోజే 19 మంది మరణించడంతో ఇక్కడ ఇప్పటివరకు చనిపోయిన వారి సంఖ్య 269కి చేరింది. గుజరాత్‌లో ఒక్కరోజే 480 కొత్త కేసులు నమోదవగా రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 20,097కి చేరింది. రాష్ట్రంలో ఒక్కరోజే 24 మంది కరోనాతో చనిపోవడంతో ఇప్పటివరకు ఇక్కడ వ్యాధి సోకి మరణించిన వారి సంఖ్య 1,249కి చేరింది. ఆంధ్రప్రదేశ్‌లో ఒక్కరోజే కొత్తగా 130 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 3,718కి చేరింది.ప్రస్తుతం ఇక్కడ 1,290 యాక్టివ్ కేసులున్నాయి. రాష్ట్రంలో కరోనాతో ఇప్పటివరకు 75మంది మరణించారు.