- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
చైనాతో సయోధ్య ప్రక్రియ మొదలు
న్యూఢిల్లీ: భారత్, చైనా సరిహద్దు ఎల్ఏసీ(వాస్తవాధీన రేఖ)లో కొనసాగుతున్న ఉద్రిక్తతల పరిష్కారానికి మధ్యవర్తిత్వం వహించేందుకు సిద్ధమని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన ప్రకటనపై భారత్ స్పందించింది. ఇరుదేశాల మధ్య సయోధ్య ప్రక్రియ ఇప్పటికే మొదలైందని భారత విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి అనురాగ్ శ్రీవాస్తవ వెల్లడించారు. అయితే, ప్రత్యేకంగా ట్రంప్ ట్వీట్‌ను ప్రస్తావించలేదు. ఇరుదేశాల మధ్య కుదిరిన ద్వైపాక్షిక ఒప్పందాలను ఉల్లంఘించకుండా బాధ్యతాయుతంగా భారత ఆర్మీ వ్యవహరించిందని తెలిపారు. అంతేకాదు, పరిస్థితులను శాంతియుతంగా పరిష్కరిచేందుకు ఇరువైపులా మిలిటరీస్థాయితో పాటు డిప్లమాటిక్ స్థాయిల్లో చర్చించేందుకు తగిన ఏర్పా్ట్లు ఉన్నాయని పేర్కొన్నారు. అయితే, ఏ చర్చల్లోనైనా భారత్ తన సార్వభౌమత్వానికి, జాతి భద్రతకు కట్టుబడి ఉంటుందని వివరించారు. ఈ వారం మొదట్లో భారత్, చైనా సరిహద్దుల్లో పరిస్థితులు అదుపులోనే ఉన్నాయని చైనా ప్రకటించిన తర్వాత తాజా వ్యాఖ్యలు రావడం గమనార్హం.