- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
స్వాతంత్ర పోరాటాన్ని ఆవిష్కరించే టాప్ సినిమాలివే..!
దిశ, వెబ్‌డెస్క్ : ఈ ఆగస్టు 15తో భారతదేశం స్వాతంత్రం సాధించి 76 వసంతాలు పూర్తి కానున్నాయి. అయితే ఆనాటి స్వాతంత్ర పోరాటాన్ని భావితరాలకు అందిస్తేనే యువతరానికి ఆనాడు సాగిన ఉద్యమాలు, వాటి తీరుతెన్నుల గురించి తెలిసే అవకాశం. అనేక పోరాటాలకు ఇప్పటికే స్ఫూర్తిగా నిలిచిన భారత స్వాతంత్రోద్యమాన్ని సినిమాల ద్వారా ఆవిష్కరించి మన ముందుంచే ప్రయత్నాన్ని సినీ రంగ ప్రముఖులు చేశారు. అందులో ఆనాడు జరిగిన వివక్ష, త్యాగాలు, అలుపెరుగని పోరాటాలు అనేక మందిలో స్ఫూర్తిని నింపుతూనే ఉన్నాయి. అలాంటి సినిమాల జాబితా ఇప్పుడూ చూద్దాం.
గాంధీ (1982)
మహాత్మా గాంధీ జీవిత చరిత్ర ఆధారంగా రూపొందించిన చిత్రం ‘గాంధీ’. ఈ సినిమాకు రిచర్డ్ అటెన్ బరో దర్శకత్వం వహించారు. గాంధీజీ జీవితం, భారత స్వాతంత్ర ఉద్యమం, భారత దేశంపై బ్రిటీష్ వలస పాలన పర్యవసనాలను ఈ సినిమాలో అద్భుతంగా చూయించారు. 1893లో దక్షిణాఫ్రికాలో రైలు నుంచి గాంధీని తోసేయడం నుంచి సినిమా ప్రారంభమై గాంధీ హత్య, అంత్యక్రియలతో ముగుస్తుంది. కాగా ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా విమర్శకుల ప్రశంసలు అందుకుంది.
లగాన్ (2001)
అమీర్ ఖాన్ ప్రధాన పాత్రలో అశుతోస్ గోవారికర్ దర్శకత్వం వహించిన సినిమా ‘లగాన్’. బ్రిటీష్ ప్రభుత్వం అధిక పన్నులు వసూలు చేసే గ్రామస్తుల చుట్టూ ఈ కథ నడుస్తుంది. పన్ను రాయితీ కోసం బ్రిటీష్ వారితో జరిగే క్రికెట్ మ్యాచ్ ఆకట్టుకుంటుంది. సినిమాలో భావోద్వేగాలు, పోరాటాలు ఆకట్టుకుంటాయి.
ది లెజెండ్ ఆఫ్ భగత్ సింగ్ (2002)
అజయ్ దేవ్ గన్ హీరోగా, రాజ్ కుమార్ సంతోషి డైరెక్టన్‌లో 2002లో తెరకెక్కిన చిత్రం ‘ద లెజెండ్ ఆఫ్ భగత్ సింగ్’. ఈ సినిమాలో భారత స్వాతంత్రం కోసం పోరాడిన భగత్ సింగ్ జీవిత చరిత్రను కళ్లకు కట్టారు. 1931 మార్చి 24న అధికారిక విచారణకు ముందు జలియన్ వాలాబాగ్ మారణకాండను చూపినప్పటి నుంచి భగత్ సింగ్ ని ఉరి తీసే వరకు ఈ సినిమాలో చూయించారు.
మంగళ్ పాండే (2005)
1857లో బ్రిటీష్ పాలకులకు వ్యతిరేకంగా పోరాడిన భారతీయ సైనికుడు మంగళ్ పాండే జీవితం ఆధారంగా ఈ సినిమాను 2005లో తెరకెక్కించారు. ఈ సినిమాలో అమీర్ ఖాన్ హీరోగా నటించారు. కేతన్ మెహతా దర్శకత్తం వహించారు. 1857 సిపాయిల తిరుగుబాటులో వీరోచితంగా పోరాడిన మంగళ్ పాండే ధీరత్వాన్ని ఈ సినమాలో అద్భుతంగా తెరకెక్కించారు.
మనికర్ణిక (2019)
2019లో విడుదలైన ‘మణికర్ణిక’ సినిమా వీరనారి ఝాన్సీ లక్ష్మీ భాయి జీవితం ఆధారంగా తెరకెక్కింది. ఈ సినిమాకు తెలుగు డైరెక్టర్ క్రిష్ దర్శకత్వం వహించారు. 1828లో బితూర్ లో పుట్టిన మణికర్ణిక (కంగనారౌత్) ఝాన్సీ, రాజు గంగాధర్ రావు(జిషు సేన్ గుప్తా) ను పెళ్లి చేసుకుంటుంది. అయితే రాజ్యంపై బ్రీటీష్ పాలకులు ఆధిపత్యం చెలాయించడాన్ని వ్యతిరేకిస్తూ సాగిన స్వాతంత్ర పోరాటం ఆకట్టుకుంటుంది.