మూస పద్ధతి వద్దు.. కొత్త పద్ధతి ముద్దు

by Anukaran |   ( Updated:2020-08-15 03:49:01.0  )
మూస పద్ధతి వద్దు.. కొత్త పద్ధతి ముద్దు
X

దిశ, సిద్ధిపేట: సీఎం కేసీఆర్ ఆధ్వర్యంలో రాష్ట్రంలోనే సిద్ధిపేట జిల్లా అన్ని రంగాలలో ముందున్నదని రాష్ట్ర మంత్రి హరీష్ రావు అన్నారు. శనివారం జిల్లా కేంద్రంలోని కలెక్టర్ కార్యాలయంలో 74 స్వాతంత్య దినోత్సవ వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన జాతీయ జెండాను ఆవిష్కరించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జిల్లా ప్రజలకు 74 వ స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణ రాష్ట్రం వ్యసాయరంగంలో విప్లవాత్మకమైన మార్పులు తీసుకువచ్చిందన్నారు. గతేడాది జిల్లాలో లక్షా 20 వేల ఎకరాలలో వరి సాగు చేస్తే కాళేశ్వరం జలాలతో ఈ ఏడాది 2 లక్షల ఎకరాలకు పైగా అదనంగా వరిసాగు పెరిగిందన్నారు. జిల్లాలో రిజర్వాయర్ల ఉండడం వల్ల అద్భుతంగా భూగర్భ జలాలు పెరిగినాయని అన్నారు. రైతులు మూస పద్ధతిలో కాకుండా కొత్త పద్ధతిలో మంచి పంటలు పండించి మంచి ఆదాయం పొందాలని సూచించారు.

రాష్ట్రంలో పుడ్ ప్రాసెసింగ్ యూనిట్ ఏర్పాటు కోసం కేసీఆర్ ఆలోచనలు చేస్తున్నట్లు తెలిపారు. రాష్ట్రంలో కోనసీమ కంటే మంచి భూములు ఉన్నాయని బంగారం పండించే భూములు ఉండడం మన అదృష్టంగా బావించలన్నారు. రైతులు వరి పంటకు ఎకరాకు రెండు బస్తాల యూరియా మాత్రమే వాడాలి.. మోతాదుకు మించి వాడవద్దు అని శాస్ర్తవేత్తలు సూచిస్తున్నారు అని తెలిపారు. జిల్లాలో 3484 చెరువులు కుంటలు చెక్ డ్యాం లు ఉంటే ప్రస్తుతం 1600 పైగా చెరువులు చెక్ డ్యాం లు అలుగు పారుతున్నాయని సంతోషం వ్యక్తం చేశారు. ప్రాజెక్ట్ లు పూర్తి కావడంతో డిస్ట్రిబ్యూటర్, మైనర్ కాలువల కోసం భూములు ఇచ్చేందుకు రైతులు స్వచ్ఛంద ఉద్యమంలా ముందుకు రావాలన్నారు.

డబుల్ బెడ్ రూం నిర్మాణంలో జిల్లా అద్భుత పురోగతి సాధించిందన్నారు. కొత్త మున్సిపల్, గ్రామ పంచాయితీ చట్టాలు వచ్చాక అభివృద్ధిలో చాలా మార్పులు వచ్చాయని ఆశాభావం వ్యక్తం చేశారు. అభివృద్ధిని చూసి ఇప్పుడు పట్టణాల నుండి ప్రజలు పల్లెల బాట పడుతున్నారన్నారు. జిల్లాలో కరోనాను వైద్యరంగం ఆదర్శవంతంగా ఎదుర్కొంటుందన్నారు. త్వరలోనే కరోనా తగ్గుముఖం పట్టగనే కేసీఆర్ చేతుల మీదుగా కొత్త కలెక్టర్, పోలీస్ కమిషనర్ కార్యాలయాలు ప్రారంభం చేసుకుందాం అని మంత్రి పేర్కొన్నారు. కొవిడ్ వల్ల అత్యంత సాదాసీదాగా స్వాతంత్ర దినోత్సవ వేడుకలు జరుపుకున్నామని హరీశ్ రావు అన్నారు.

Advertisement

Next Story

Most Viewed