కరోనా.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలి: వినోద్ కుమార్

by Anukaran |
కరోనా.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలి: వినోద్ కుమార్
X

దిశ ప్రతినిధి, మేడ్చల్: కరోనా మహామ్మారిని జయించేందుకు ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు బి.వినోద్ కుమార్ అన్నారు. శనివారం మేడ్చల్ జిల్లా కలెక్టరేట్ ఆవరణలో జరిగిన 74వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో వినోద్ కుమార్ ముఖ్యఅతిథిగా పాల్గొని జాతీయ జెండాను ఆవిష్కరించి, గౌవర వందనాన్ని స్వీకరించారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రజలందరికి స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. కరోనా వల్ల ప్రజలు ఎలాంటి ఆందోళన చెందవద్దని, ప్రభుత్వం అండగా ఉంటుందన్నారు.

జిల్లా కలెక్టర్ వాసం వెంకటేశ్వర్లు మాట్లాడుతూ.. కరోనా నేపథ్యంలో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను భౌతిక దూరం పాటిస్తూ.. నిరాడంబరంగా జరుపుకున్నట్లు తెలిపారు. జిల్లా ప్రజలకు కలెక్టర్ స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. కార్యక్రమంలో మల్కాజిగిరి ఎంపీ రేవంత్ రెడ్డి, జిల్లా జెడ్పీ ఛైర్మన్ శరత్ చంద్రారెడ్డి, ఉప్పల్ శాసన సభ్యుడు బి.సుభాష్ రెడ్డి, రాచకొండ పోలీస్ కమీషనర్ మహేశ్ భగవత్, జిల్లా అనదపు కలెక్టర్లు కె.విద్యాసాగర్, జాన్ శ్యాంసన్, కీసర, మల్కాజిగిరి ఆర్డీఓలు రవి, మల్లయ్య, జిల్లా రైతు బంధు సమితి అధ్యక్షుడు నందారెడ్డి, జెడ్పీ వైస్ ఛైర్మన్ బెస్త వెంకటేశ్, జెడ్పీటీసీలు హరివర్దన్ రెడ్డి, అనిత, శైలాజ ,ప్రజాప్రతినిధులు, జిల్లా అధికారులు, ఉద్యోగ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed