సెంచరీతో కదంతొక్కిన అయ్యర్

by Shiva |
సెంచరీతో కదంతొక్కిన అయ్యర్
X

టీమిండియా విజయాల పరంపర కొనసాగిస్తున్నట్టే కనబడుతోంది. న్యూజిలాండ్ లో టీ20 సిరీస్ విజయం ఇచ్చిన ఉత్సాహంతో కుర్రాళ్లు కదంతొక్కుతున్నారు. రోహిత్ శర్మ గాయంతో సిరీస్ కు దూరమైన నేపథ్యంలో వన్డే సిరీస్ లో కోహ్లీ ప్రయోగాలకు పూనుకున్నాడు. ఓపెనర్లుగా పృథ్వీషా (20)కు జోడీగా మయాంఖ్ అగర్వాల్ (32) పంపాడు. శుభారంభాన్నిచ్చిన వీరిద్దరూ అదే ఊపును కొనసాగించలేకపోయారు. క్రీజులో నిలదొక్కుకున్నారనుకునేంతలో పెవిలియన్ చేరారు. తరువాత కోహ్లీ (51) అర్ధ సెంచరీతో ఆకట్టుకున్నప్పటికీ భారీ ఇన్నింగ్స్ ఆడలేకపోయాడు. దీంతో శ్రేయస్ అయ్యర్ నిలకడైన బ్యాటింగ్ ను ప్రదర్శించాడు. సెంచరీతో శభాష్ అనిపించుకున్నాడు. 101 బంతుల్లో బంతికో పరుగుచెప్పున 11 బౌండరీలు ఒక సిక్సర్ సాయంతో సెంచరీ చేశాడు. అతనికి అండగా కేఎల్ రాహుల్ నిలిచాడు. అర్ధ సెంచరీతో రాహుల్ టీ20 జోరును కొనసాగించాడు. దీంతో 44 ఓవర్లు ముగిసే సరికి టీమిండియా మూడు వికెట్ల నష్టానికి 285 పరుగులు చేసింది. కివీస్ బౌలర్లలో సౌతీ, గ్రాండ్ హోం, సోదీ తలో వికెట్ తీశారు. జట్టు స్కోరు 300 దాటుతుందని అంచనా వేస్తున్నారు.

Advertisement

Next Story

Most Viewed