కరోనా ఎఫెక్ట్.. మహిళలకు ఎక్కువవుతున్న వేధింపులు

by vinod kumar |   ( Updated:2021-03-27 02:18:17.0  )
కరోనా ఎఫెక్ట్.. మహిళలకు ఎక్కువవుతున్న వేధింపులు
X

దిశ, వెబ్ డెస్క్: కరోనా .. కరోనా ..కరోనా.. ప్రపంచంలో ఎక్కడ చూసినా కరోనా విలయతాండవం చేస్తుంది. రోజురోజుకు కరోనా తీవ్రత పెరిగిపోతుంది. ఇక ఈ కరోనా తో ప్రపంచం అల్లకల్లోలంగా మారిన విషయం తెలిసిందే. ఇక ఈ మహమ్మారి వలన ఎంతోమంది నిరాశ్రయులు అయ్యారు. ఎంతోమంది ఉద్యోగులు ఇంటికే పరిమితమయ్యారు. ఇక ఈ వైరస్ ప్రభావం విద్యార్థులు, ఉద్యోగుల మీదే కాదు ఇంట్లో మహిళల మీద కూడా చూపించింది. గతేడాది లాక్ డౌన్ సమయంలో మహిళలపై గృహహింస కేసులు భారీగా పెరిగినట్లు జాతీయ మహిళా కమిషన్ నివేదిక పేర్కొంది.

ఎన్‌సీడబ్ల్యూ అధికారికంగా వెల్లడించిన సమాచారం ప్రకారం.. మహిళలపై నేరాలకు సంబంధించి 2019లో మొత్తం 19,730 ఫిర్యాదులు రాగా, 2020లో ఆ సంఖ్య 23,722కు చేరింది. లాక్ డౌన్ సమయంలో ఇంటికే పరిమితమైన భర్తలుతమను వేధిస్తున్నారంటూ మహిళలు గృహహింస కేసులు నమోదు చేస్తున్నారు. ఉద్యోగం లేకపోవడం వలన ఆర్థికంగా అభద్రతాభావం, ఒత్తిడి పెరగడం, ఆర్థికపరమైన ఆందోళన వంటి కారణాల వల్ల మగవారు వారి కోపాలను భార్యలపై తీర్చుకొంటున్నారని నివేదిక తెలుపుతుంది. ఇక ఎప్పుడు ఇంటిపని, వంట పని, ఉద్యోగాలతో అలిసిపోతున్న మహిళలు ఈ వేధింపులు ఎక్కువ కావడంతో ఇంకా మనోవేదనకు గురి అవుతున్నారని మహిళా సంఘాలు తెలుపుతున్నాయి.

Advertisement

Next Story

Most Viewed