బీసీ గురుకులాల్లో ప్రవేశాలకు గడువు పెంపు

by Shyam |
బీసీ గురుకులాల్లో ప్రవేశాలకు గడువు పెంపు
X

దిశ, న్యూస్​బ్యూరో: మహాత్మా జ్యోతిబాపూలే తెలంగాణ వెనుకబడిన తరగతుల సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థ జూనియర్‌, డిగ్రీ కాలేజీల్లో (ఇంగ్లీష్​ మీడియం) ప్రవేశాలకు గడువు పొడిగించినట్టు విద్యాసంస్థల కార్యదర్శి మల్లయ్య భట్టు తెలిపారు. జూనియర్‌, డిగ్రీ కళాశాలల్లో మొదటి సంవత్సరంలో ప్రవేశాల కోసం ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకునేందుకు ఈనెల 19వ తేదీ వరకూ గడువు పొడిగించినట్టు పేర్కొన్నారు. విద్యార్థులు తప్పనిసరిగా ఆన్​లైన్​లోనే దరఖాస్తులు సమర్పించాలని, పరీక్ష తేదీపై విద్యార్ధులకు నేరుగా సమాచారమిస్తామన్నారు. అర్హులైన బీసీ, ఈబీసీ, ఎస్​సీ, ఎస్టీ విద్యార్థినీ, విద్యార్థులు ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలని ఆయన సూచించారు.

Advertisement

Next Story

Most Viewed