- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రూ.1.19 లక్షల కోట్ల ఆదాయపు పన్ను రీఫండ్ల జారీ!
దిశ, వెబ్‌డెస్క్: పన్ను చెల్లింపుదారులకు ఆదాయ పన్ను శాఖ శుభవార్త అందించింది. ఈ ఏడాది ఏప్రిల్ 1 నుంచి నవంబర్ 15 మధ్య కాలంలో మొత్తం 1.02 కోట్లకు పైగా పన్ను చెల్లింపుదారులకు రూ.1.19 లక్షల కోట్లను ఆదాయ పన్ను రిఫండ్లను చెల్లించినట్టు ఐటీ విభాగం గురువారం ఓ ప్రకటనలో తెలిపింది. అదనపు వడ్డీ, ఆలస్య రుసుములను తిరిగి చెల్లించామని, ఇందులో 2021-22 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన 67.99 లక్షల రిఫండ్లు ఉన్నాయని పేర్కొంది.
సమీక్షించిన ఆర్థిక సంవత్సరంలో ఇప్పటివరకు మొత్తం రూ.13,141.94 కోట్ల రిఫండలను జారీ చేశామని ఐటీ విభాగం వివరించింది. ‘2021 ఏప్రిల్ 1-నవంబర్ 15 మధ్య కేంద్ర ప్రత్యక్ష పన్ను విభాగం(సీబీడీటీ) 1.02 కోట్లకు పన్ను చెల్లింపుదారులకు రూ.1,19,093 కోట్ల రిఫండ్లను జారీ చేసింది. ఇందులో రూ.38,034 కోట్ల విలువ ఆదాయ పన్ను రిఫండ్లు కాగా రూ.81,059 కోట్ల కార్పొరేట్ పన్ను రిఫండ్లు జారీ చేసినట్టు ఆదాయ పన్ను విభాగం వెల్లడించింది.