భారీపన్ను రీఫండ్ చేసిన ఆదాయపన్ను శాఖ.. ఎంతంటే ?

by Harish |
incom-tax
X

దిశ, వెబ్‌డెస్క్: ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి సంబంధించి సెప్టెంబర్ మొదటివారం వరకు మొత్తం రూ. 70,120 కోట్ల ఐటీ పన్ను రీఫండ్లను చెల్లించినట్టు ఆదాయ పన్ను శాఖ ఆదివారం వెల్లడించింది. దీంతో 24.70 లక్షల మందికి వ్యక్తిగత ఆదాయ పన్ను రీఫండ్ల మొత్తం 16,753 కోట్లను, 1.38 లక్షల మందికి కార్పొరేట్ పన్ను రీఫండ్లు రూ. 53,367 కోట్లను చెల్లించినట్టు ఐటీ శాఖ తెలిపింది. కేంద్ర ప్రత్యక్ష పన్నుల విభాగం (సీబీడీటీ) ఈ ఏడాది ఏప్రిల్ 1 నుంచి సెప్టెంబర్ 6 మధ్య మొత్తం 26.09 లక్షలకు పైగా పన్ను చెల్లింపుదారులకు రూ. 70.120 కోట్లను రీఫండ్ చేసిందని ఐటీ విభాగం ఓ ప్రకటనలో పేర్కొంది.

Advertisement

Next Story

Most Viewed