- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
రెండు నెలల్లో రూ. 26,276 కోట్ల రీఫండ్లు చెల్లించిన ఐటీ విభాగం!
దిశ, వెబ్‌డెస్క్: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఏప్రిల్, మే నెలల్లో మొత్తం 15.47 లక్షలకు పైగా పన్ను చెల్లింపుదారులకు రూ. 26,276 కోట్ల పన్ను రీఫండ్లను చెల్లించినట్టు ఆదాయ పన్ను శాఖ శుక్రవారం తెలిపింది. ఇందులో 15.02 లక్షల పన్ను చెల్లింపుదారులకు రూ. 1,538 కోట్ల విలువైన వ్యక్తిగత ఆదాయ పన్ను రీఫండ్లు చెల్లించింది. 44,531 కార్పొరేట్ పన్ను చెల్లింపుదారులకు రూ. 18,738 కోట్ల రీఫండ్లను చెల్లించినట్టు కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు (సీబీడీటీ) వెల్లడించింది. అయితే, చెల్లించిన పన్ను రీఫండ్లు ఏ ఆర్థిక సంవత్సరానికి సంబంధించినవో ఐటీ విభాగం వెల్లడించలేదు. ఇక, ఈ ఏడాది మార్చితో ముగిసిన 2020-21 మొత్తం ఆర్థిక సంవత్సరానికి 2.38 కోట్లకు పైగా పన్ను చెల్లింపుదారులకు రూ. 2.62 లక్షల కోట్ల విలువైన పన్ను రీఫండ్లను చెల్లించినట్టు ఐటీ విభాగం ఓ ప్రకటనలో వివరించింది. గత ఆర్థిక సంవత్సరంలో జారీ చేసిన రీఫండ్లు 2019-20లో చెల్లించిన 1.83 లక్షల కోట్లతో పోలిస్తే 43.2 శాతం ఎక్కువ కావడం గమనార్హం.