- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
రూ.20 వేల లోపు డిపాజిట్లు చెల్లించండి
దిశ, క్రైమ్ బ్యూరో: ఉమ్మడి రాష్ట్ర వ్యాప్తంగా బాధితులు ఉన్న అగ్రిగోల్డ్ కేసు ఓ కొలిక్కి రానుంది. అగ్రిగోల్డ్ ఆస్తులను ప్రభుత్వం వేలం వేసి బాధితులకు పంపిణీ చేయాలని కోరుతూ గతకొంత కాలంగా హైకోర్టులో విచారణ కొనసాగుతోంది. ఆస్తుల వేలం విషయంలో విచారణ నిలిచిపోగా, బాధితులు ఇటీవల సుప్రీంకోర్టును ఆశ్రయించారు. దీంతో సుప్రీంకోర్టు హైకోర్టులో పరిష్కరించుకోవాలని సూచించడంతో తెలంగాణ హైకోర్టులో తిరిగి విచారణ ప్రారంభమైంది. దీనిపై సోమవారం విచారణ జరగ్గా, అగ్రిగోల్డ్ కేసులో రూ.20 వేల లోపు డిపాజిట్ దారులకు డబ్బులు పంపిణీ చేసేందుకు ఏపీ ప్రభుత్వానికి హైకోర్టు అనుమతించింది. అంతేగాకుండా, ఈ పంపిణీ వచ్చే ఏడాది మార్చి 31 వరకూ నాటికి ఈ ప్రక్రియ పూర్తి చేయాలని ఆదేశించింది.
దీనిపై తెలంగాణ హైకోర్టు సూచనలను అంగీకరించిన ఏపీ ప్రభుత్వం వార్డు సచివాలయం ద్వారా డిపాజిట్ దారుల వివరాలను సేకరిస్తామని తెలిపింది. సేకరించిన వివరాలను సీఐడీ డీఎస్పీ, ఆర్డీవో ద్వారా పరిశీలిస్తామని హామీ ఇచ్చింది. జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి, కలెక్టర్, సీఐడీ ఎస్పీ ధ్రువీకరించిన పిదపనే డబ్బులు పంపిణీకి జాబితాను సిద్ధం చేస్తామని స్పష్టం చేసింది. కలెక్టర్ ద్వారా అర్హులైన డిపాజిట్ దారులకు డబ్బులను బ్యాంక్ ఖాతాలో జమ చేస్తామన్నారు. ఇదిలా ఉండగా, అగ్రిగోల్డ్ కేసును ఏపీ హైకోర్టుకు బదిలీ చేయాలని ఏపీ ప్రభుత్వం విన్నవించగా.. పరిపాలనాపరమైన అధికారం హైకోర్టు సీజేకు మాత్రమే ఉంటుందని ధర్మాసనం తెలిపింది. అయితే, ఆస్తుల వేలంపై పెండింగ్‌లో తమ పిటిషన్లను విచారించాలని యూనియన్ బ్యాంక్ (పాత పేరు ఆంధ్రాబ్యాంక్), ఎస్‌బీఐ బ్యాంకులు కోరగా, గురువారం విచారించేందుకు అంగీకరించింది.