మహారాష్ట్రలో ఒక్కరోజే 466 కేసులు.. 9 మంది మృతి

by vinod kumar |
మహారాష్ట్రలో ఒక్కరోజే 466 కేసులు.. 9 మంది మృతి
X

ముంబై: ప్రపంచదేశాలను తీవ్ర భయాందోళనలకు గురిచేస్తున్న కరోనా మహమ్మారి భారత్‌లోనూ విజృంభిస్తోంది. దీని కట్టడికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కఠిన చర్యలు తీసుకుంటున్నప్పటికీ పాజిటివ్ కేసులు మాత్రం రోజురోజుకూ పెరుగుతూనే ఉన్నాయి. దేశవ్యాప్తంగా చూసుకున్నట్టయితే దీని తీవ్రత మహారాష్ట్రలో ఎక్కువగా ఉంది. దేశంలో అత్యధిక పాజిటివ్ కేసుల నమోదుతో ఆ రాష్ట్రం ఇప్పటికే మొదటిలో స్థానంలో ఉండగా, సోమవారం ఒక్కరోజే మరో 466 కేసులు వెలుగులోకొచ్చాయి. అలాగే, తొమ్మిది మంది మృతిచెందారు. దీంతో మహారాష్ట్రలో కరోనా కేసుల సంఖ్య మొత్తంగా 4,666కు చేరింది.

Tags : Maharashtra, 466 corona cases, nine deaths, one day, covid-19

Next Story

Most Viewed