- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
అక్కడ 54 పాజిటివ్ కేసులు.. 10 రోజులు లాక్‌డౌన్
దిశ, ఆందోల్: రాష్ట్రంలో కరోనా వైరస్ విలయతాండవం చేస్తోంది. రోజురోజుకూ కరోనా బాధితుల సంఖ్య పెరుగుతూనే ఉంది. కేసుల సంఖ్య పెరుగుతుండడంతో ఆందోల్ నియోజకవర్గ ప్రజలు భయబ్రాంతులకు గురవుతున్నారు. నియోజకవర్గ పరిధిలో సోమవారం 54 పాజిటివ్ కేసులు నమోదు అయినట్టు జిల్లా వైద్యాధికారులు తెలిపారు. ఇందులో ఆందోల్‌లో 27, వట్‌పల్లిలో 3, మునిపల్లి లో 11, రాయికోడ్ లో 9, అల్లాదుర్గంలో 4 కేసులు నమోదు కాగా, టేక్మాల్, రేగోడ్, పుల్కల్ మండలాల ఒక్క కేసు నమోదు కాలేదు. అయితే పుల్కల్, చౌటకూర్ మండలంలోని రెవెన్యూ శాఖలో పనిచేస్తున్న కొందరు అధికారులు కరోనా బారిన పడినట్టు సమాచారం. ఇంకా మరికొందరి రిపోర్ట్‌లు రావాల్సి ఉందని వైద్య శాఖ అధికారులు తెలిపారు. కేసులు పెరుగుతున్న నేపథ్యంలో వైరస్‌ను అరికట్టేందుకు గాను పుల్కల్ మండలానికి చెందిన వ్యాపారులు 10 రోజుల పాటు తమ వ్యాపార సంస్థలను మూసివేయనున్నట్టు ప్రకటించారు. ఈ నెల 29 నుంచి ఆగస్టు 8 వరకు మూసివేసినందుకు నిర్ణయం తీసుకున్నట్టు వారు తెలిపారు.