- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
‘బోట్ లైబ్రరీ’ గురించి మీకు తెలుసా?
దిశ, వెబ్‌డెస్క్: ఈ-తరానికి చేతిలో మొబైల్ ఉండగా, గ్రంథలయాలకు వెళ్లే పని లేకుండా అయిపోయింది. అయితే మొబైల్‌లో సినిమా చూడ్డానికి, థియేటర్‌లో మూవీ ఎంజాయ్ చేయడానికి ఎంత తేడా ఉందో, ఈ-పుస్తకానికి, డైరెక్ట్ చేతిలో పట్టుకునే చదివే పుస్తకానికి అంతే తేడా ఉంటుంది. కంటికి శ్రమ కూడా తగ్గడంతో పాటు కాసేపు ఆ మొబైల్ రక్కసికి దూరంగా హ్యాపీగా ఇష్టమైన పుస్తకాన్ని చదువుతూ, ఏ డిస్టర్బెన్స్ లేకుండా ఆ అక్షర సాగరంలో ఈతకొట్టొచ్చు. అందులోనూ లైబ్రరీ ప్రకృతి అందాల్లో కొలువుదీరితే, ఇక ఆ రీడర్ అనుభూతి మాములుగా ఉండదు. అందుకే వెస్ట్ బెంగాల్ ట్రాన్స్‌పోర్ట్, హెరిటేజ్ బుక్ స్టోర్స్‌తో కలిసి చిన్నారుల కోసం బోట్ లైబ్రరీని ప్రారంభించింది.
హుగ్లీ నది సాక్షిగా ప్రకృతిని ఒడిలో సేదతీరుతూ, పడవలో ప్రయాణిస్తూ పుస్తకాలు చదివితే ఎంత బాగుంటుందో కదా! ఆ దృశ్యాన్ని ఊహించుకుంటేనే ఎంతో ఆహ్లాదంగా అనిపిస్తుంది కదా. మరి ఇంకెందుకు ఆలస్యం కోల్‌కతాలోని తొలి ‘బోట్ లైబ్రరీ’లో ఆనందంగా అక్షర సేద్యం చేసేయండి. ఈ బోట్ లైబ్రరీలో 500లకు పైగా ఇంగ్లిష్, బెంగాలీ భాషల పుస్తకాలు అందుబాటులో ఉన్నాయి. బోట్ ట్రిప్ మొత్తంగా 3 గంటల పాటు ఉండగా, ఈ ట్రిప్ మిలేనియం పార్క్ నుంచి మొదలవుతుంది. ప్రతి రోజూ మూడు ట్రిప్పులు ఉంటాయని నిర్వాహకులు తెలిపారు. ఉచిత వైఫై సౌకర్యం కూడా అందిస్తున్న ఈ బోట్‌లో, పెద్దలకు రూ.100 కాగా, చిన్నారులకు రూ. 50 బోట్ ట్రిప్ కోసం వసూలు చేస్తారు. అంతేకాదు ఆ బోట్ ట్రిప్‌లో స్టోరీ టెల్లింగ్, డ్రామటైస్డ్ రీడింగ్, పోయెట్రీ సెషన్స్, బుక్ లాంచెస్, మ్యూజిక్ ప్రొగ్రామ్స్ నిర్వహిస్తారు. మొబైల్‌కే అంకితమైన చిన్నారులను పుస్తక పఠనం దిశగా మళ్లించడానికి ఇదో మంచి ఆలోచన అని రచయితలు అభిప్రాయపడుతున్నారు.