- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఫ్లయింగ్ కారుకు జపాన్ గ్రీన్ సిగ్నల్!
దిశ, ఫీచర్స్: టోక్యో ఆధారిత స్టార్టప్ ‘స్కై డ్రైవ్’కు చెందిన ఫ్లయింగ్ కార్ (eVTOL -ఎలక్ట్రిక్ వెహికల్ టేకాఫ్ అండ్ ల్యాండింగ్ ఎయిర్‌క్రాఫ్ట్) ‘ఎస్‌డీ-03’.. జపాన్ ప్రభుత్వ సేఫ్టీ సర్టిఫికెట్ అందుకుంది. ఇది 2025 నాటికి ఈ-ఓటల్ వాహనాలను వాణిజ్యీకరించడానికి వీలు కల్పించనుంది. ఫ్లయింగ్ కార్ల ప్రయాణానికి ఇది గ్రీన్ సిగ్నల్‌గా టెక్ నిపుణులు భావిస్తుండగా, ఇతర ఎగిరే కార్లకు మార్గం సుగమం చేయనుంది.
ఎలక్ట్రిక్ ఫ్లయింగ్ కార్ కాన్సెప్ట్‌కు ప్రస్తుతం స్క్రైడ్రైవ్‌కు చెందిన ఎస్‌డీ-03 ప్రాతినిధ్యం వహిస్తోంది. ఇది ఆగస్ట్ 2020లో విజయవంతమైన మానవ సహిత విమాన ప్రదర్శనను చేసింది. SD-03 ఓపెన్ క్యాబిన్‌ను కలిగి ఉండగా, పైలట్‌కు మాత్రమే కూర్చునేందుకు సీటు ఉంటుంది. SD-03 ఎనిమిది ప్రొపెల్లర్స్ ద్వారా శక్తిని పొందుతుంది. గంటకు 30 మైళ్ల వేగంతో ప్రయాణించే దీని గరిష్ట వేగం గంటకు 48 కిలోమీటర్లు. ఇది 30 కిలోల పేలోడ్ సామర్థ్యాన్ని కూడా కలిగి ఉంది. 2025 నాటికి జపాన్‌లోని ఒసాకా బే ప్రాంతంలో ఫ్లయింగ్ టాక్సీ సేవలను ప్రారంభించాలని కంపెనీ ఆశిస్తుండగా, పర్వత ప్రాంతాల్లో పనిచేసే వారికి ఇది ఉపయోగపడనుంది. ఈ క్రమంలోనే ప్రభుత్వ అనుమతి కోసం వేచిచూస్తున్న కంపెనీ.. ల్యాండ్, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్, ట్రాన్స్‌పోర్ట్ అండ్ టూరిజం మినిస్ట్రీ (MLIT) నుంచి భద్రతా ధృవీకరణ పత్రాన్ని తాజాగా పొందింది. ఈ స్టార్టప్ తన ఫ్లయింగ్ కార్ ప్రోటోటైప్‌ను మొదటిసారిగా 2018లో ప్రదర్శించారు.
ఇక ఇండియా విషయానికొస్తే.. మొదటి హైబ్రిడ్ ఫ్లయింగ్ కారును చెన్నయ్‌కు చెందిన ‘వినత ఏరోమొబిలిటీ’ స్టార్టప్ అభివృద్ధి చేసింది. ఈ అటానమస్ హైబ్రిడ్ ఫ్లయింగ్ కారును అక్టోబర్ 5న లండన్‌లో జరిగే ప్రసిద్ధ విమానయాన ప్రదర్శన ‘ఎక్సెల్’లో ప్రపంచానికి పరిచయం చేసింది.
‘వినతా ఏరోమొబిలిటీ యువ బృందం ఆసియాలోనే మొట్టమొదటి హైబ్రిడ్ ఫ్లయింగ్ కారు కాన్సెప్ట్ మోడల్‌ను పరిచయం చేయడం ఆనందంగా ఉంది. ఈ ప్రాజెక్ట్ టేకాఫ్ అయిన తర్వాత ఫ్లైయింగ్ కార్లు.. ప్రజలతో సహా కార్గోను రవాణా చేయడంతో పాటు అత్యవసర సేవలను అందించేందుకు ఉపయోగపడతాయి’ అని పౌర విమానయాన శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా పేర్కొన్నాడు.