కరోనా ఎఫెక్ట్ : ఆ దేశంలో అడుగుపెడితే ఐదేళ్లు జైలుకే..

by vinod kumar |   ( Updated:2021-05-02 05:04:05.0  )
కరోనా ఎఫెక్ట్ : ఆ దేశంలో అడుగుపెడితే ఐదేళ్లు జైలుకే..
X

దిశ, వెబ్ డెస్క్ : గతేడాది నుండి కరోనా మహమ్మారి ఎంతటి ప్రళయాన్ని సృష్టిస్తుందో అందరికి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ఇతర దేశాల నుండి వచ్చేవారిని భారత్ నిరాకరించింది. ఎవరు తమ దేశానికి రావొద్దు అంటూ కోరింది. ఇకపోతే ఈ సీన్ ఇప్పుడు రివర్స్ అయ్యింది. భారత్ లో కరోనా సెకండ్ వేవ్ విజృంభిస్తున్న తరుణంలో ఇతర దేశాలు భారత్ నుండి ఎవరు రావొద్దు అంటూ హెచ్చరించాయి. ఇప్పటీకే అమెరికా, యూకే వంటి దేశాలు ఇండియా నుంచి వెళ్లే పలు విమానాలపై నిషేధం విధించాయి. పౌరులెవ్వరూ ఇండియాలో అడుగు పెట్టవద్దని, ఇండియా నుండి వచ్చేవారు తమ దేశంలో అడుగుపెట్టొద్దని ఆ దేశాలు ఆదేశించాయి. అయితే ఈ దేశాలు కన్నా ఒకడుగు ముందుకేసింది ఆస్ట్రేలియా. ఇండియా లో పర్యటించి, తమ దేశానికి వచ్చినవారికి జైలు శిక్ష విధించడం జరుగుతుందని ఆదేశాలు జారీచేసింది.

ఇండియాలో 14 రోజులు పర్యటించి.. తిరిగి స్వదేశంలో అడుగుపెడితే ఐదేళ్ల వరకు జైలు లేకపోతే 48 లక్షలు జరిమానా విధిస్తున్నట్లు ప్రకటించింది. ఈ ఆదేశాలు మే 1 నుండి అమలులోకి వచ్చాయి. ఇక ఈ ఆదేశాలతో ఇండియాలో ఉన్న ఆస్ట్రేలియా వాసులకు ప్రాణసంకటంగా మారింది. అటు స్వదేశం వెళ్లలేక , ఇటు భారత్ లో ఉండలేక సతమతమవుతున్నారు. ఇప్పటివరకు భారత్ లో 9 వేలమంది ఆస్ట్రేలియన్లు ఉన్నట్లు అంచనా. మరీ వీరందరూ ఎప్పుడు స్వదేశానికి తిరిగివెళ్తామో అని ఎదురుచూస్తూ ఇండియాలో కాలం గడుపుతున్నారు.

Advertisement

Next Story

Most Viewed