ఆకట్టుకుంటున్న వ్యాక్సిన్​ గణపతి ప్రతిమ

by Shyam |
ఆకట్టుకుంటున్న వ్యాక్సిన్​ గణపతి ప్రతిమ
X

దిశ, చార్మినార్​: వ్యాక్సిన్​పై సందేహాలు వద్దు .. వ్యాక్సిన్​ ముద్దు అనే సందేశాన్ని ఇచ్చే విధంగా పాతబస్తీ లాల్​ దర్వాజ నాగులచింతలో ఫ్యూచర్ ఫౌండషన్స్ సొసైటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కరోనా వాక్సినేషన్ గణపతి ప్రతిమ పలువురిని విశేషంగా ఆకట్టుకుంటుంది. ప్రజలకు వినాయక చవితి ఉత్సవాల ద్వారా ఓ సోషల్ మెసేజ్ ఇప్పించాలనే ఉద్దేశ్యంతో సమాజంలో జరుగుతున్న తాజా అంశాలను దృష్టిలో పెట్టుకొని ప్రతి సంవత్సరం వినూత్న రీతిలో గణపతులను ఏర్పాటు చేస్తున్నామని ఫ్యూచర్ ఫౌండేషన్స్ సొసైటీ అధ్యక్షుడు సచిన్ చందన్ తెలిపారు.

2017 సంవత్సరంలో అయోధ్య రామ మందిరం నిర్మాణం దృష్టిలో పెట్టుకొని రాముని ఆకృతిలో గణపతి ప్రతిమను, 2018 కేరళలో వచ్చిన వరదల సందర్భంగా కధకలి గణపతి, 2019లో చంద్రయాన్ గణేష్, 2020లో కోవిడ్ ఫ్రంట్ లైన్ వారియర్స్ గణేష్ ప్రతిమలను ఏర్పాటు చేసినట్లు సచిన్ చందన్ పేర్కొన్నారు.

Advertisement

Next Story