- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
రోడ్లపై లాక్‌డౌన్ పెయింటింగ్స్.. అదుర్స్
by Shyam |

X
దిశ, మెదక్: కరోనాపై అవగాహనకు తాము సైతం అంటూ ముందుకొచ్చారు కళాకారులు. రంగురంగుల చిత్రాలను వేసి మహమ్మారికి దూరంగా ఉండండని సూచిస్తున్నారు. సంగారెడ్డి జిల్లా బీహెచ్‌ఈఎల్ చౌరస్తాలో పటాన్‌చెరు కమర్షియల్ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో కరోనా వైరస్‌పై అవగాహన కల్పించడం కోసం భారీ పెయిటింగ్స్ వేశారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు లాక్‌డౌన్ పాటించండి.. అందరూ కలిసి వైరస్‌ను నిర్మూలించండి అనే నినాదాలతో జాతీయ రహదారిని రంగులతో తీర్చిదిద్దారు. కళాకారులకు పోలీసులు సైతం తగిన సహాయం అందించారు.
Tags: Impressive painting, lockdownon, highway, BHEL, sangareddy
Next Story