అభివృద్దిని అడ్డుకోవడం కరెక్ట్ కాదు: ఎస్ఐ పి. విఠల్ రెడ్డి 

by Shyam |
అభివృద్దిని అడ్డుకోవడం కరెక్ట్ కాదు: ఎస్ఐ పి. విఠల్ రెడ్డి 
X

దిశ, పరిగి: మున్సిపాలిటీలో జరుగుతున్న అభివృద్దికి అడ్డుపడేలా ప్రవర్తించడం కరెక్ట్ కాదని పరిగి ఎస్ఐ పి.విఠల్ రెడ్డి చిరు వ్యాపారులు సున్నితంగా హెచ్చరించారు. పరిగి మున్సిపల్ పరిధిలోని గంజ్ రోడ్డులో ఆర్టీసీ బస్టాండ్, డిపో కాంపౌండ్‌ను ఆనుకొని కొన్నేళ్లుగా చిరు వ్యాపారులు జీవనోపాధి పొందుతున్నారు. మున్సిపల్ నిధులతో రోడ్డు వెడల్పు చేస్తూ ఇరువైపుల అండర్ డ్రైనేజీ కడుతున్నారు. కాగా మున్సిపల్ నుంచి ఈ చిరువ్యాపారులకు స్థలం కాలీ చేసి వెళ్లాలంటూ నోటీసుల మీద నోటీసులు అందజేశారు. ఉన్నఫలంగా మమ్మల్ని ఖాళీ చేసి వెళ్ళమంటే మా పొట్ట కొట్టినట్లు అవుతుందని కొన్నేళ్లుగా వేడుకుంటున్నారు.

అప్పట్లో రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పట్నం మహేందర్ ప్రస్తుత ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డి ఆర్టీసీ కాంప్లెక్స్ కట్టి అందులో మీకు మొదటి ప్రాధాన్యత ఇస్తామన్నారు. అనంతరం పరిగి ఎమ్మెల్యే కొప్పుల మహేశ్ రెడ్డి కూడా దుకాణ సముదాయాలు కట్టిస్తామన్నారు. అప్పటి వరకు దుకాణ సముదాయాలు వ్యవసాయ మార్కెట్ కార్యాలయావరణలో వేసుకోవాలని సూచించారు. పనుల జాప్యం కారణంగా చిరు వ్యాపారులు తమ దుకాణాలను మరోచోటికి షిఫ్ట్ చేయలేదు. తాజాగా మంగళవారం మధ్యాహ్నం మున్సిపల్ అధికారులు జేసీబీతో వచ్చి చిరువ్యాపారుల దుకాణాలు జేసీబీతో తీసుకెళ్లే ప్రయత్నం చేశారు. ఇదేంటి ఉన్న ఫలంగా ఇలా జేసీబీతో మా దుకాణాలను ఎత్తేస్తే మా పరిస్థితి ఏంటంటూ మున్సిపల్ సిబ్బందిని నిలదీశారు.

దీంతో మున్సిపల్ సిబ్బంది చిరువ్యాపారుల మధ్య వాగ్వాదం నెలకొంది. విషయం తెలుసుకున్న పరిగి ఎస్ఐ పి.విఠల్ రెడ్డి సంఘటనా స్థలానికి చేరుకొని ఇరువుని శాంతింపజేశారు. అభివృద్దికి అందరం సహకరించాలన్నారు. చిరు వ్యాపారులు మాకు కాస్త టైం కావాలని అడగడంతో మున్సిపల్ అధికారులతో ఎస్ఐ మాట్లాడి ఆదివారం వరకు సమయం ఇప్పించారు. ఉన్నఫలంగా జేసీబీ పెట్టి మా ఫర్పిచర్ను ధ్వంసం చేసి, దుకాణాలను కూల్చివేసేందుకు ప్రయత్నించడం కరెక్ట్ కాదని బాధితులు పెదవి విరిచారు.

Advertisement

Next Story

Most Viewed