గంగమ్మ ఒడికి ఖైరతాబాద్​ గణేషుడు

by Shyam |
గంగమ్మ ఒడికి ఖైరతాబాద్​ గణేషుడు
X

దిశ , వెబ్​డెస్క్: తొమ్మిది రోజుల పాటు భక్తులతో విశేష పూజలందుకొని ‘పంచముఖ రుద్ర మహా గణపతి ’ రూపంలో దర్శనమిచ్చిన ఖైరతాబాద్ వినాయకుడు గంగమ్మ ఒడికి చేరాడు. ​ భక్తుల కోలాహలం మధ్య సందడిగా ఉదయం 8.18 గంటలకు గణనాథుడి శోభాయాత్ర ప్రారంభమైంది. టెలిఫోన్​ భవన్​ మీదుగా 12.50 గంటలకు తెలుగుతల్లి ఫ్లై ఓవర్‌కు చేరుకుంది. 12.50కు తెలుగుతల్లి ఫ్లై ఓవర్ జంక్షన్​కు చేరుకోగానే నగర సీపీ అంజనీకుమార్​ ఖైరతాబాద్​ మహా వినాయకుడికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. 2.41కి ‘పంచముఖ రుద్ర మహా గణపతి ’ గణపయ్యను భక్తులకు చివరిసారిగా చూసే అవకాశం కల్పించారు. 3.‌‌06లకు ఖైరతాబాద్​ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో హారతి ఇచ్చారు. 3.11కు నాలుగో నెంబర్​ లిఫ్ట్​దగ్గర ఉన్న ప్రత్యేక క్రేన్​ దగ్గరికి తరలించారు. 3.20 గంటలకు మహా వినాయకుడిని హుస్సేన్​సాగర్​లో నిమజ్జనం చేశారు.

Advertisement

Next Story