ఈ ఇయర్‌ ఇంట్రెస్టింగ్ మూవీస్

by Shyam |
ఈ ఇయర్‌ ఇంట్రెస్టింగ్ మూవీస్
X

దిశ, వెబ్‌డెస్క్: 2020కి బైబై చెప్పేసే టైమ్ వచ్చేసిందంటే.. ఓ సారి ఈ ఇయర్‌లో జరిగిన ఇంట్రెస్టింగ్ అంశాలను రౌండప్ చేసుకునే సమయం ఆసన్నమైనట్లే. ఈ ఏడాది కరోనా వల్ల చాలా సినిమాల షూటింగ్స్ ఆగిపోయినా, మరెన్నో మంచి చిత్రాలు ఓటీటీల్లో విడుదలయ్యాయి. అలా ఈ ఏడాది ఓటీటీలో విడుదలై, టాప్ రేటింగ్స్ సాధించిన సినిమాల జాబితాను ఐఎండీబీ తాజాగా విడుదల చేసింది.

సౌండ్ ఆఫ్ మెటల్ – 7.8 (ఐఎండీబీ రేటింగ్)

ఇది ఓ మెటల్ డ్రమ్మర్ చుట్టూ సాగే కథ. అనుకోకుండా ఆ డ్రమ్మర్ తన వినికిడి శక్తి కోల్పోగా, అతని లైఫ్ ఎలాంటి టర్న్ తీసుకుంది? మళ్లీ తనకు వినికిడి శక్తి తిరిగి వస్తుందా? అన్నదే ఈ సినిమా కథ. డ్రమ్మర్‌గా లీడ్ రోల్ పోషించిన రిజ్ అహ్మద్ సూపర్బ్ యాక్టింగ్‌తో షో అంతా స్టీల్ చేశాడు. డారియస్ మర్డర్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించగా, జురిచ్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో బెస్ట్ ఫిల్మ్‌గా ‘గోల్డెన్ ఐ’ అవార్డ్ అందుకుంది.

ద ట్రయల్ ఆఫ్ ది చికాగో 7 – 7.8

చికాగోలో 1968-69 ప్రాంతంలో కౌంటర్ కల్చర్, యుద్ధ వ్యతిరేక నిరసనలు వెల్లువెత్తగా, ఆ కుట్రల ఆరోపణల నేపథ్యంలో నిరసన చేపట్టిన ఏడుగురుని అరెస్ట్ చేస్తారు. ఈ సంఘటనల నేపథ్యంలో తెరకెక్కిన చిత్రమే ‘ద ట్రయల్ ఆఫ్ ది చికాగో 7’. సచా బరోన్ కోహెన్, ఎడ్డీ రెడ్‌మైన్, జోసెఫ్ గార్డెన్ లెవిట్‌లు ఇందులో కీలక పాత్రలు పోషించారు.

లూడో – 7. 6

బాలీవుడ్ టాలెంటెడ్ డైరెక్టర్ అనురాగ్ బసు దర్శకత్వంలో తెరకెక్కిన ‘లూడో’ సినిమా ఓ నలుగురు వ్యక్తుల చుట్టూ తిరిగే కథ. బ్లాక్ కామెడీ జానర్‌లో వచ్చిన ఈ చిత్రం ప్రేక్షకులతో పాటు విమర్శకులను మెప్పించింది. ఇందులో అభిషేక్ బచ్చన్, రాజ్ కుమార్ రావ్, ఆదిత్య రాయ్ కపూర్, ఫాతిమా సనా షేక్, సన్యా మల్హోత్రా, పంకజ్ త్రిపాఠి నటించారు.

ఇక ఈ జాబితాలో నాలుగో స్థానంలో క్రిస్టోఫర్ నొలాన్స్ ‘టెన్నెట్’ నిలవగా, బాలీవుడ్ మూవీ ‘లూట్‌కేస్’ నెంబర్ 5లో నిలిచింది. ‘వండర్ ఉమెన్, ఆన్ వార్డ్, మా రేనిస్ బ్లాక్ బాటం, ఏ బ్యూటిఫుల్ డే ఇన్ ద నైబర్‌హుడ్, మాంక్’ చిత్రాలు టాప్ టెన్‌లో నిలిచాయి.

Advertisement

Next Story